PKSDT : పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
గత కొన్నాళ్లుగా పవన్, సాయి ధరమ్ తేజ్ సినిమాకు 'బ్రో' అనే టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా చిత్రయూనిట్ దీనిపై అప్డేట్ ఇచ్చింది.

Pawan kalyan and Sai Dharam Tej movie title and first look announced on 18th may
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎలక్షన్స్ ఉండటంతో 2023 చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేయాలని వరుస షూట్స్ చేస్తున్నాడు పవన్. ఈ లిస్ట్ లో మొదట ఉన్న సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించిన వినోదాయ సిత్తం(Vinodaya Sitham) రీమేక్. ఈ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబోలో సముద్రఖని(Samuthirakani) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
పవన్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో సినిమా అనేసరికి రీమేక్ అయినా కూడా మామా అల్లుళ్ళ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలుపెట్టి 25 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ పూర్తి చేశారు. ఇప్పటికే సినిమా షూట్ మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని జులై 28న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఇంత ఫాస్ట్ గా సినిమా షూట్ పూర్తి చేసి, ఫాస్ట్ గా రిలీజ్ కి ప్లాన్ చేస్తుండటంతో అభిమానులతో పాటు, అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఇప్పటిదాకా ఈ సినిమాకు టైటిల్ ప్రకటించలేదు. గత కొన్నాళ్లుగా పవన్, సాయి ధరమ్ తేజ్ సినిమాకు ‘బ్రో’ అనే టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా చిత్రయూనిట్ దీనిపై అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్ తో పటు ఫస్ట్ లుక్ కూడా మే 18 గురువారం నాడు సాయంత్రం 4.14కు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో పవన్, మెగా అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు.
The 'TIME' has come ✅
All your thirst will be quenched ?#PKSDT Title & First Look Tomorrow at 4:14PM ⚡
Stay tuned ⏳@PawanKalyan @IamSaiDharamTej@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @ZeeStudios_ @zeestudiossouth#PKSDTFromJuly28? pic.twitter.com/EUkgibhmds— People Media Factory (@peoplemediafcy) May 17, 2023