Bro Movie : ఇండియాలోనే కాదు పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా పవన్ కళ్యాణ్ బ్రో సందడి..

ఇండియాలోనే కాదు పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా పవన్ కళ్యాణ్ బ్రో మూవీ సందడి చేస్తుంది. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ..

Bro Movie : ఇండియాలోనే కాదు పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా పవన్ కళ్యాణ్ బ్రో సందడి..

Pawan kalyan Bro Movie in top 10 streaming list in Bangladesh Pakistan

Bro Movie : ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో సినిమా’ ఓటీటీకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల (ఆగస్టు) 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ ప్రసారం అవుతూ వస్తుంది. ఇక ఈ మెగా మల్టీస్టారర్ ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులు అంతా.. ఓటీటీలోకి రావడంతోనే షో వేసుకొని చూసేశారు. ఈ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు.

Chiranjeevi : ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కథ చిరంజీవి చేయాల్సింది.. నిర్మాత అశ్వినీదత్!

దీంతో ఈ మూవీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. ఇండియా నెట్‌ఫ్లిక్స్ లో టాప్ 1 స్ట్రీమింగ్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే పవన్ సునామీ ఇక్కడితో ఆగిపోలేదు. మన పొరుగు దేశాలకు కూడా చేరుకుంది. బాంగ్లాదేశ్ (Bangladesh), పాకిస్తాన్ (Pakistan) దేశాల్లో టాప్ చిత్రాల్లో 8 స్థానంలో ఈ సినిమా నిలిచింది. అలాగే నాన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ లిస్ట్ లో 7వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ లిస్ట్ ఆగష్టు 21 నుంచి 27 డేట్ వరకు తీసింది. అంటే 25వ తారీఖున రిలీజ్ అయిన బ్రో.. జస్ట్ టు డేస్ లోనే ఈ రికార్డు క్రియేట్ చేసింది.

Ram Charan : ఇంటర్నేషనల్ అవార్డు నామినేషన్స్‌లో రామ్‌చరణ్..

ఇక ఈ విషయాన్ని పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం తమిళ్ మూవీ ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించాడు. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగు రీమేక్ ని కూడా డైరెక్ట్ చేశాడు. కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా వారియర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.