Pawan Kalyan
Pawan Kalyan : ఇప్పుడు అంతా పాన్ ఇండియా మయం అయిపోయింది. హీరోలు కూడా పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తున్నారు. మేము కూడా పాన్ ఇండియా హీరోలు అని చెప్పుకోడానికే ఇష్టపడుతున్నరు హీరోలు. అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తూ తమ రేంజ్ ని పెంచుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం నేను ఇంకా రీజనల్ యాక్టర్ నే అంటున్నారు.
హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా పవన్ నేడు నేషనల్ మీడియాతో మాట్లాడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో పాన్ ఇండియా ప్రస్తావన వచ్చింది.
Also Read : They Call Him OG : వేరే సినిమాల కంటే OG సినిమాకు ఎందుకు అంత హైప్..? క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. నేను రీజనల్ యాక్టర్, తెలుగు యాక్టర్ ని మాత్రమే. నా ఏరియాలో నాకు కంఫర్ట్ జోన్ ఉంటుంది. తెలుగులో నేను కంఫర్ట్ గా సినిమాలు చేస్తాను. తమిళ్, కన్నడ, హిందీ అక్కడ నేను అంతగా తెలియకపోవచ్చు. బంగారం సినిమా తర్వాత 2007లో ఒకసారి ఇజ్రాయిల్ వెళ్ళాను. జెరూసలెంలో ఒక ఇండియన్ రెస్టారెంట్ లో తినడానికి వెళ్ళాను. అక్కడ ఒక పాలస్తీనా వ్యక్తి నన్నే చూస్తూ ఉన్నాడు. అతను నన్ను అటాక్ చేస్తాడేమో అనుకున్న. కానీ అతను నా దగ్గరికి వచ్చి మీరు పవన్ కళ్యాణా అని అడిగాడు. అవును మీకెలా తెలుసు అంటే మీ సినిమాలు హిందీలో చూస్తాను అని చెప్పాడు. అప్పుడు నాకు తెలిసింది తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తారని. అప్పటిదాకా నాకు ఆ విషయం తెలీదు. దాని వల్ల నాకు కొంత గుర్తింపు వచ్చిందని తెలిసింది అన్నారు.
పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. గత ఎన్నికల ముందు వరకు పవన్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో తెలుసు. కానీ గత ఎన్నికల్లో పవన్ సృష్టించిన ప్రభంజనం, ప్రధాని మోదీ సైతం నేషనల్ మీడియా ముందు పవన్ ని తుఫాన్ అని అభివర్ణించడంతో పాటు సనాతన ధర్మం కోసం పవన్ నిలబడటంతో నేషనల్ వైడ్ పొలిటికల్ లీడర్ గా మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయినా పవన్ ఒదిగి ఉండి నేను ఇంకా రీజనల్ యాక్టర్ అని చెప్పుకోవడం గమనార్హం.