They Call Him OG : వేరే సినిమాల కంటే OG సినిమాకు ఎందుకు అంత హైప్..? క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..
పవన్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా OG సినిమాకు భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే.

They Call Him OG
They Call Him OG : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రేపు జులై 24 రిలీజ్ కాబోతుంది. ఒక్క ట్రైలర్ తోనే సినిమాపై కావాల్సినంత హైప్ వచ్చింది. ఇక పవన్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
అయితే పవన్ చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కంటే కూడా OG సినిమాకు భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క గ్లింప్స్ తోనే ఈ సినిమా హైప్ ఆకాశాన్ని అంటుకుంది. ఇక ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అయితే పవన్ ఎక్కడ కనపడినా OG.. OG.. అని అరుస్తున్న సంగతి తెలిసిందే.
నేడు పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాతో మాట్లాడగా ఇప్పుడు మీ చేతిలో ఉన్న సినిమాల్లో మిగిలిన వాటికంటే OG కి ఎందుకు ఎక్కువ హైప్ ఉంది అని అడిగారు. దీనికి పవన్ సమాధానమిస్తూ.. అదే నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు హీరోలు గ్రే షేడ్స్ ఉంటే నచ్చుతుంది. జనాలకు వైలెన్స్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది. పర్ఫెక్ట్ గా ఉంటే ఇప్పుడు నచ్చట్లేదు. ఇప్పుడు సమాజం గ్రే షేడ్ లోకి వెళ్ళిపోయింది. సమాజంలో అందరూ నెగిటివ్ షేడ్స్ కి, గ్రే షేడ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే OG సినిమాకు అంత హైప్ ఉందేమో అని అన్నారు.