Adavallu Meeku Joharlu: వెనక్కి తగ్గిన శర్వానంద్.. కొత్త డేట్ ఎప్పుడంటే?

మరో ఐదు రోజులలోనే థియేటర్ల భీమ్లా నాయక్ గర్జన మొదలవుతుంది. సెకండ్ లాక్ డౌన్ నుండి పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. భీమ్లా నాయక్ తో వాళ్ళ ఆశ తీరబోతుంది.

Adavallu Meeku Joharlu: వెనక్కి తగ్గిన శర్వానంద్.. కొత్త డేట్ ఎప్పుడంటే?

Aadavallu Meeku Joharlu

Updated On : February 19, 2022 / 5:51 PM IST

Adavallu Meeku Joharlu: మరో ఐదు రోజులలోనే థియేటర్ల భీమ్లా నాయక్ గర్జన మొదలవుతుంది. సెకండ్ లాక్ డౌన్ నుండి పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. భీమ్లా నాయక్ తో వాళ్ళ ఆశ తీరబోతుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన భీమ్లా నాయక్ ఈసారి వెనక్కి తగ్గే ఛాన్స్ లేనేలేదని మేకర్స్ ధీమాగా చెప్తున్నారు. ముందు భీమ్లా నాయక్ కోసం రెండు డేట్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలు మొదటి డేట్ ఫిబ్రవరి 25కే ఫిక్సయ్యారు. ఆ వచ్చినపుడులే అన్నట్లు అదే డేట్ మరో ఇద్దరు యంగ్ హీరోలు ప్రకటించారు.

Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!

మెగా కాంపౌండ్ నుండే వరుణ్ తేజ్ గని సినిమాని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా అదే డేట్ లాక్ చేసుకున్నాడు. అయితే.. భీమ్లా నాయక్ అదే డేట్ ప్రకటించడంతో గని దాదాపుగా వెనక్కు తగ్గడం కన్ఫర్మ్ అని అనుకుంటుండగా మేకర్స్ అయితే ఇంకా ప్రకటించలేదు. మెగా హీరోలే కాబట్టి గని ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. ఇక శర్వా ఆడవాళ్ళూ మీకు జోహార్లు మాత్రం ముందు వెనక్కు తగ్గేది లేదు వచ్చేస్తాం అంటూ ప్రకటనలు ఇచ్చినా చివరికి వాయిదా వేసుకున్నారు.

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ముందు అనుకున్న డేట్ నుండి సరిగ్గా రెండు వారాలు గ్యాప్ ఇచ్చి తన సినిమాని తీసుకురావాలని ఆడవాళ్లు మీకు జోహార్లు మేకర్స్ డిసైడ్ అయ్యారు. మరి గని కూడా వాయిదా తప్పదని అనుకుంటుండగా.. కొత్త డేట్ ఎప్పుడు ఇస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.