Pawan Kalyan: హరీష్ శంకర్ అనౌన్స్మెంట్.. వద్దు బాబోయ్ అంటోన్న పవన్ ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి, ఆయన సినిమాల గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే, క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతున్నాయి. అంతలా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు గతంలోనే దర్శకుడు హరీష్ శంకర్ అనౌన్స్ చేయగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను కూడా ఆ సినిమాకు ఫిక్స్ చేశారు.

Pawan Kalyan Fans Do Not Want Theri Remake From Harish Shankar
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి, ఆయన సినిమాల గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే, క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతున్నాయి. అంతలా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు గతంలోనే దర్శకుడు హరీష్ శంకర్ అనౌన్స్ చేయగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌ను కూడా ఆ సినిమాకు ఫిక్స్ చేశారు.
Harish Shankar : పవన్ అభిమానులకు శుభవార్త చెప్పబోతున్న హరీష్ శంకర్..
అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల పక్కనబెట్టారని.. త్వరలోనే మరో సినిమాను పవన్ కల్యాణ్‌తో చేయబోతున్నట్లు హరీష్ శంకర్ తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశాడు ఈ డైరెక్టర్. పవన్ కల్యాణ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సినిమా తమిళంలో విజయ్ నటించిన ‘తేరి’ సినిమాకు రీమేక్‌గా రాబోతుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు.
Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
తమ అభిమాన హీరోతో రీమేక్ చిత్రాలు తీయకండి.. స్ట్రెయిట్ తెలుగు కథలతో సినిమాలు చేయండి అంటూ వారు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఈ క్రమంలోనే ‘WeDontWantTheriRemake’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది. హరీష్ శంకర్ పవన్‌తో ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేయగానే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటంతో ఇప్పుడు అందరూ ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే హరీష్ శంకర్ పవన్‌తో చేయబోయేది తేరి మూవీకి రీమేక్యేనా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Big excitement is on the way !!! Watch out this space guys !!!! @PawanKalyan @MythriOfficial @ThisIsDSP @DoP_Bose #AnandSai pic.twitter.com/Axt7ayn4qh
— Harish Shankar .S (@harish2you) December 8, 2022