HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే.. వరుస అప్డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ కి పండగే..

తాజాగా నేడు మరో అప్డేట్ ఇచ్చారు హరిహర వీరమల్లు మూవీ యూనిట్.

HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే.. వరుస అప్డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ కి పండగే..

Updated On : October 13, 2024 / 11:24 AM IST

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇవ్వడంతో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మూవీ యూనిట్. కొన్ని రోజుల క్రితమే విజయవాడలో భారీ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తిచేశారు. నిన్న దసరా సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసి మొదటి సాంగ్ ని త్వరలోనే రిలీజ్ చేస్తామని, ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారని అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేసారు.

Also Read : Bigg Boss 8 : బిగ్‌బాస్‌లో బతుకమ్మ.. అమ్మాయిలను ఎత్తుకున్న అబ్బాయిలు.. సెలబ్రిటీలు, డ్యాన్సులతో ఆదివారం ప్రోమో..

తాజాగా నేడు మరో అప్డేట్ ఇచ్చారు హరిహర వీరమల్లు మూవీ యూనిట్. హరిహర వీరమల్లు షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబరు 14 నుంచి అంటే రేపట్నుంచి మొదలవుతుందని టాలీవుడ్ కి సమాచారం అందించారు మూవీ యూనిట్. అలాగే షూటింగ్ శరవేగంగా చేసి నవంబర్ 10 నాటికి మొత్తం షూటింగ్ పూర్తిచేస్తారని నిర్మాతలు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు గ్లింప్స్ రిలీజయి అంచనాలు పెంచాయి. సామ్రాజ్యవాదులు, అణచివేతదారులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం, పేదల కోసం ఒక యోధుని అలుపెరగని పోరాటమే ఈ సినిమా కథ అని నిర్మాతలు తెలిపారు.

Image

మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మాణంలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్, సచిన్ ఖేడ్ ఖర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, అయ్యప్ప శర్మ, సునీల్, నీహార్ కపూర్, సుబ్బరాయ శర్మ, సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్, నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, దలీప్ తాహిల్, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రెండు పార్టులుగా రాబోతున్న హరిహర వీరమల్లు నుంచి పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.