Ustaad Bhagat Singh : 80 కోట్లకు ఉస్తాద్ భగత్ సింగ్.. అక్కడ మాత్రం భారీ హిట్..
Ustaad Bhagat Singh OTT Response: థియేటర్స్ లో ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించింది కానీ సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. (Ustaad Bhagat Singh)
Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Good Response in Netflix OTT
Ustaad Bhagat Singh OTT: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19న ఉగాది కానుకగా రిలీజ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మాణంలో ఈ సినిమా భారీగానే తెరకెక్కింది. రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు.
థియేటర్స్ లో ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించింది కానీ సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్, యాక్షన్ సీక్వెన్స్, తొలిప్రేమ సాంగ్.. ఇవి మాత్రమే సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ అయితే అసలు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా థియేటర్స్ లో యావరేజ్ గా నిలిచింది. కేవలం 100 కోట్ల గ్రాస్ మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ నుంచి రాబట్టింది. ఓవరాల్ గా థియేటరికల్ గా నష్టాన్నే చూసింది ఈ సినిమా.
Also Read : Imanvi : వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ‘ఫౌజీ’ భామ.. ఇమాన్వి ఫొటోలు..
అయితే థియేటర్స్ లో యావరేజ్ గా నిలిచినా ఇప్పుడు ఓటీటీలో భారీ హిట్ గా నిలిచింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏప్రిల్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాని దాదాపు 80 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. మొదటి వారంలోనే ఆల్మోస్ట్ 2.5 మిళియన్స్ వ్యూయర్ షిప్ ని సాధించింది. ఏకంగా 6.2 మిలియన్ వ్యూయింగ్ హవర్స్ ని సాధించింది.
నెట్ ఫ్లిక్స్ లో మొదటి పది రోజుల పాటు ఇండియాలో ట్రెండింగ్ లో ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. ఇండియాలోనే కాక అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, దుబాయ్, మలేషియా, మాల్దీవ్స్.. లాంటి పలు దేశాల్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చి రెండు వారాలు అవుతున్నా ఇంకా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మంచి వ్యూస్ తెచ్చుకుంటుంది. థియేటర్స్ లో యావరేజ్ గా నిలిచినా ఈ సినిమా ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Varun Sandesh : నా వైఫ్ మిస్సింగ్.. అంటున్న వరుణ్ సందేశ్..
