Bro Movie : ‘బ్రో’తో హ్యాట్రిక్ కొట్టిన పవర్ స్టార్.. థియేటర్స్‌లో ప్రతి సీన్‌కి అరుపులే..

సముద్రఖని డైరెక్షన్లో వచ్చిన బ్రో గ్రాండ్ ఓపెనింగ్స్ తో బరిలోకి దిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అంచనాలు పెంచేసిన బ్రో రిలీజ్ అయ్యాక ఇంకా క్రేజ్ తెచ్చుకుంది. సీరియస్ సబ్జెక్ట్ ని ఎంటర్టైనింగ్ పాయింట్ లో తీసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది టీమ్ .

Bro Movie : ‘బ్రో’తో హ్యాట్రిక్ కొట్టిన పవర్ స్టార్.. థియేటర్స్‌లో ప్రతి సీన్‌కి అరుపులే..

Pawan Kalyan Hatrik Hit with Bro Movie after Vakeel Saab Bheemla Nayak

Updated On : July 29, 2023 / 10:00 AM IST

Pawan kalyan Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద తన పవర్ మరో సారి చూపించారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అన్న సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటిదాకా వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు మాస్ హిట్స్ అయితే అంతే క్రేజ్ తో తాజాగా రిలీజ్ అయిన ‘బ్రో’కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులని, అభిమానులని మెప్పిస్తుంది. ఒక మంచి ఎమోషనల్ కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, ఫ్యాన్స్ కోసం వింటేజ్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ అన్ని తీసుకొచ్చి పది నిమిషాలకి ఒకసారి సినిమాలో హై ఇచ్చారు ఆడియన్స్ కి. ఇక పవన్ అదిరిపోయే లుక్స్, స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో అదరగొట్టారు. దీంతో థియేటర్స్ లో ప్రతి సీన్ కి ఫ్యాన్స్ అరుపులు, విజిల్స్ తో రెచ్చిపోయారు. ఇక చివరి 15 నిముషాలు ప్రేక్షకులని ఏడిపించారు.

సముద్రఖని డైరెక్షన్లో వచ్చిన బ్రో గ్రాండ్ ఓపెనింగ్స్ తో బరిలోకి దిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అంచనాలు పెంచేసిన బ్రో రిలీజ్ అయ్యాక ఇంకా క్రేజ్ తెచ్చుకుంది. సీరియస్ సబ్జెక్ట్ ని ఎంటర్టైనింగ్ పాయింట్ లో తీసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది టీమ్ . ఆల్రెడీ తమిళ్ లో చూసిన సినిమాని, సీరియస్ ఎమోషనల్ సబ్జెక్టు పవన్ కళ్యాణ్ తీస్తే తెలుగులో ఎవరుచూస్తారు అన్న టాక్ కి విరుద్ధంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బ్రో.

Double Ismart : డబల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ విలన్.. బిగ్ బుల్ సంజయ్ దత్.. పాన్ ఇండియా రేంజ్‌లో ఇస్మార్ట్ రామ్..

మామాఅల్లుళ్ల మాసివ్ కాంబినేషన్లో ఫస్ట్ నుంచి అంచనాలు క్రియేట్ చేసిన బ్రో రిలీజ్ అయ్యి ఆ హైప్ ని అలాగే కంటిన్యూ చేస్తోంది. పవన్ కమ్ బ్యాక్ అయిన తర్వాత బ్రో మూడో హిట్ గా నిలిచింది. వకీల్ సాబ్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత భీమ్లా నాయక్, ఇప్పుడు ‘బ్రో’తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. పొలిటికల్ గా బిజీగా ఉంటూనే కమిటెడ్ గా సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ రాబోయే OG సినిమాపై కూడా అంచనాలు పెంచేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా యాక్సిడెంట్ తర్వాత కంబ్యాక్ విరూపాక్ష సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు బ్రో సినిమాతో వరుసగా రెండో హిట్ అందుకున్నాడు.