Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో అది వేరే లెవెల్ అంటోన్న హరీష్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, సరికొత్త పాత్రలో పవన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టును ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు పవన్.

Pawan Kalyan Intro From Ustaad Bhagat Singh To Be Next Level Says Harish Shankar
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, సరికొత్త పాత్రలో పవన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టును ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు పవన్.
Ustaad Bhagat Singh : మొదలైన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పనులు..
ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసినదగ్గర్నుండి ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వినిపించినా, అభిమానులు ఎంతో ఆతృతగా ఫాలో అవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని ఆయన తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ సినిమాలోని టైటిల్ ట్రాక్‌కు ర్యాపర్ ప్రణవ్ చాగంటి అదిరిపోయే లిరిక్స్ అందించాడని.. ఈ సాంగ్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ ట్యాగ్‌పై జరుగుతున్న రచ్చ..
సాధారణంగానే పవన్ సినిమాల్లో టైటిల్ ట్రాక్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్‌కు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టైటిల్ ట్రాక్ గురించి చిత్ర దర్శకుడు ఇలా సోషల్ మీడియాలో రివీల్ చేస్తుండటంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.
— Harish Shankar .S (@harish2you) January 13, 2023