Khushi: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఖుషి టికెట్లు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఔట్ అండ్ ఔట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమాతో పవన్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో రొమాంటిక్ సినిమాల్లో నయా ట్రెండ్ క్రియేట్ చేశాడు పవన్. ఇక ఈ సినిమాను దర్శకుడు కమ్ యాక్టర్ ఎస్.జె.సూర్య తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.

Khushi: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఖుషి టికెట్లు!

Pawan Kalyan Khushi Re-Release Tickets Getting Sold Like Hotcakes

Updated On : December 28, 2022 / 10:03 PM IST

Khushi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఔట్ అండ్ ఔట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమాతో పవన్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో రొమాంటిక్ సినిమాల్లో నయా ట్రెండ్ క్రియేట్ చేశాడు పవన్. ఇక ఈ సినిమాను దర్శకుడు కమ్ యాక్టర్ ఎస్.జె.సూర్య తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.

Khushi : 21 ఏళ్ళ తర్వాత.. ఖుషి సాంగ్‌కి డ్యాన్స్ వేసిన భూమిక.. వైరల్ అవుతున్న వీడియో

ఇలాంటి లవ్ స్టోరి సినిమాలు వచ్చి ఎంతకాలం అయినా, వాటికి ఉండే క్రేజ్ వేరే అని ఈ సినిమా అప్పట్లో రుజువు చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఖుషి చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమా టికెట్లు ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

Pawan Kalyan: న్యూ ఇయర్ గిఫ్ట్‌తో ‘ఖుషి’ చేయనున్న పవన్

పవన్ కల్యాణ్ క్రేజ్ అంటే ఇదే అనేలా కొత్త సినిమాలకు పోటీగా ఈ మూవీ టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి ఇన్నాళ్లకు ఈ సినిమా మళ్లీ రీ-రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమా రీ-రిలీజ్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.