Pawan Kalyan: న్యూ ఇయర్ గిఫ్ట్‌తో ‘ఖుషి’ చేయనున్న పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్‌ప్యాక్డ్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

Pawan Kalyan: న్యూ ఇయర్ గిఫ్ట్‌తో ‘ఖుషి’ చేయనున్న పవన్

Pawan Kalyan Khushi To Re-Release On New Year Eve

Updated On : December 18, 2022 / 6:29 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్‌ప్యాక్డ్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

Pawan Kalyan : ‘ది రియల్ యోగి’ బుక్‌ని లాంచ్ చేసిన నాగబాబు..

అయితే ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆయన తన అభిమానులను ‘ఖుషి’ చేసేందుకు మరోసారి సిద్ధమయ్యాడు. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఖుషి’ని రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దర్శకుడు ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని డిసెంబర్ 31న రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Khushi : 21 ఏళ్ళ తర్వాత.. ఖుషి సాంగ్‌కి డ్యాన్స్ వేసిన భూమిక.. వైరల్ అవుతున్న వీడియో

ఈ సినిమాను వారం రోజుల పాటు పలు థియేటర్లలో ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భూమిక చావ్లా హీరోయిన్‌గా నటించగా, ఆలీ, నాజర్, శివాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ మూవీ రీ-రిలీజ్‌లో ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి.