క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ ఇదే!

  • Published By: vamsi ,Published On : December 23, 2019 / 04:05 AM IST
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ ఇదే!

Updated On : December 23, 2019 / 4:05 AM IST

రాజకీయాల్లో బిజిబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమా షూటింగ్‌లో ఫిబ్రవరి నుంచి పాల్గొనే అవకాశం ఉంది. దీనిని దిల్ రాజు, బోణీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తారు. 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్.. మరో సినిమాని కూడా ట్రాక్ ఎక్కించేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో సినిమాకు కూడా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కథని ఓకే చేసేశారు పవన్ కళ్యాణ్. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తారు. జానపద కథాంశంతో తెరకెక్కే ఈ సినిమా బడ్జెట్ దాదాపు వందకోట్లు ఉంటుందని సమాచారం. కథ ప్రకారం.. సినిమాకి చాలా సెట్ వర్క్ అవసరం. బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యంలా ఓ రాజ్యాన్ని నిర్మిస్తారని అంటున్నారు. పెద్దపెద్ద రాజదర్బార్లు, కోటలు.. గుర్రపు స్వారీ లు, కత్తి యుద్దాలు ఇందులో కనిపిస్తాయట.  ప్యాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తుండగా.. ఈ సినిమాని క్రిష్.. మణికర్ణిక, గౌతమీ పుత్ర శాతకర్ణి రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు.

లేటెస్ట్‌గా క్రిష్ సిన‌మాలో ప‌వ‌న్ పాత్ర గురించి ఆసక్తికర విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ప‌వ‌న్ దొంగ‌గా క‌నిపిస్తాడట. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ ఇది కాగా.. మ‌హ‌మ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం, అప్ప‌టి ప‌రిస్థితులను క్రిష్ తెర‌పై చూపించ‌బోతున్నారు. పిరియాడిక్ డ్రామా కోసం భారీ సెట్లు వేయ‌బోతున్నారు. దొంగ అనే అర్థం వ‌చ్చే టైటిల్ కోసం క్రిష్ బృందం ఇప్పటికే క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.