ట్రిపుల్ ధమాకా ఇద్దామని..కష్టపడుతున్నపవర్ స్టార్

ట్రిపుల్ ధమాకా ఇద్దామని..కష్టపడుతున్నపవర్ స్టార్

Updated On : January 13, 2021 / 5:34 PM IST

Pawan Kalyan movies : లాస్ట్ ఇయర్ టార్గెట్ మిస్ అయ్యింది. ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చేద్దామనుకున్న పవర్ స్టార్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే ఈసారి పక్కా ప్లాన్ తో అసలుకు వడ్డీతో కలిపి కొడదామని డిసైడ్ అయ్యారు పవన్. మరి ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసే సినిమాలెన్ని..? బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ చేద్దామనుకున్నారు పవన్ కళ్యాణ్.

అయితే కరోనాతో షూటింగ్ కి బ్రేక్ పడడంతో వకీల్ సాబ్, క్రిష్ రెండు సినిమాలు ఆగిపోయాయి. వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి రెండు సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అనుకున్నారు ఆడియన్స్. కానీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అందుకే ఈ సారి అసలుతో పాటు వడ్డీ కలిపి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యారు. లాస్ట్ ఇయర్ డిలేని ఈ సంవత్సరం మేనేజ్ చేద్దామనుకుంటున్నారు. అందుకే మొన్నే వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న పవర్ స్టార్ క్రిష్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కూడా 2021 లో రిలీజ్ చెయ్యడానికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు పవన్.

వకీల్ సాబ్, క్రిష్ తో సినిమాలే కాకుండా పవర్ స్టార్ తన 28 వ సినిమాని హరీష్ శంకర్ తో అనౌన్స్ చేశారు. ఈ సినిమాలు ఇంకా ఓ కొలిక్కి కూడా రాకుండానే అప్పట్లో ఒకడుండే వాడు సినిమాని డైరెక్ట్ చేసిన సాగర్ చంద్రతో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. ఇలా లాస్ట్ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ చేద్దామనుకున్నా..ఒక్కటి కూడా ఆడియన్స్ ముందుకు రాకపోవడంతో ఈ సారి ట్రిపుల్ ధమాకా ఇద్దామని తెగ కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్.