Bro Collections : 100 కోట్లు దాటేసిన ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్‌లోనే అత్యంత ఫాస్ట్‌గా..
పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే బ్రో కలెక్షన్స్ అదరగొట్టేశాయి. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Collections Crossed 100 Crores in just Three Days
Bro Movie : పవన్ కళ్యాణ్ (Pawan kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం (Vinodhaya Sitham) సినిమాకు బ్రో రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని (Samuthirakani) దర్శకత్వంలో తెరకెక్కింది. ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. బ్రో సినిమా అటు పవన్ అభిమానులకి, ఇటు ఫ్యామిలీలకు కూడా విపరీతంగా కనెక్ట్ అయింది.
ఇక పవన్ సినిమా అంటేనే ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే బ్రో కలెక్షన్స్ అదరగొట్టేశాయి. బ్రో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. పవన్ కెరీర్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. రెండో రోజు కూడా ఇదే జోరు కంటిన్యూ చేస్తూ బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మొత్తం రెండు రోజుల్లో 75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక మూడో రోజు 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్రో సినిమా ఏకంగా మూడు రోజుల్లోనే 101 కోట్ల 54 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బ్రో సినిమా చాలా ఫాస్ట్ గా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించి కలెక్షన్స్ సునామి రప్పిస్తున్నారు. ఈ వారం పెద్ద సినిమాలేమి లేకపోవడం, సినిమా కూడా పెద్ద హిట్ అవ్వడంతో ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఇక బ్రో సినిమా 100 కోట్లు సాధించడంతో పవన్ కళ్యాణ్ వరుసగా మూడో సినిమా 100 కోట్లు సాధించారు. పవన్ కంబ్యాక్ ఇచ్చిన వకీల్ సాబ్, ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్ లోకి వచ్చాయి.
#BroTheAvatar WW Box Office
Hits a CENTURY in just 3 days with limited release across the world.
Day 1 – ₹ 48.09 cr
Day 2 – ₹ 27.61 cr
Day 3 – ₹ 25.84 crTotal – ₹ 101.54 cr
|#PawanKalyan | #Bro|| pic.twitter.com/lTzJjk59Ok
— Manobala Vijayabalan (@ManobalaV) July 31, 2023