Akira Entry: రామ్‌చరణ్ చేస్తున్న RC16 సినిమాతో పవన్ కుమారుడు అకీరా గ్రాండ్‌గా ఎంట్రీ?

ఇప్పటికే ఓపెనింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో..

Akira Entry: రామ్‌చరణ్ చేస్తున్న RC16 సినిమాతో పవన్ కుమారుడు అకీరా గ్రాండ్‌గా ఎంట్రీ?

Akira Nandan

Updated On : October 1, 2024 / 9:42 PM IST

మెగా ఫ్యామిలీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టమే. ఎందరు హీరోలు వచ్చినా..ఎంతమంది కొత్త స్టార్లు వచ్చినా మెగా హీరోల నటనే వేరు. ఇప్పుడు మరో యంగ్ హీరో మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వెండితెర మీద కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా సింగిల్‌గా కాదు..మెగా పవర్‌ స్టార్ట్‌తో కలసి నటించబోతున్నాడని వినిపిస్తున్న టాక్‌ ఆసక్తికరంగా మారింది.

పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్ సినీ ఎంట్రీకి రంగం సిద్దమైందని తెలుస్తోంది. తన అన్న రామ్‌చరణ్ చేస్తున్న RC16 సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నాడంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

ఇప్పటికే ఓపెనింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌ యంగ్ క్యారెక్టర్ ఉందంటున్నారు. ఇది చాలా ఎగ్జైట్‌మెంట్‌ కలిగించే క్యారెక్టర్ అంటున్నారు. బుచ్చిబాబుతో రామ్‌చరణ్‌ చేసే RC 16 సినిమాలో చరణ్ మల్లయోధుడిగా కనిపిస్తాడట. ఇందులో ఉత్తరాంధ్ర యాస మాట్లాడబోతున్నాడు చరణ్.

ఒకప్పటి మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో అకీరానందన్ నటిస్తున్నారన్న ప్రచారం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒకే ఫ్రేమ్‌లో రామ్‌చరణ్..అకీరానందన్ కనిపిస్తే థియేటర్‌లో మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. ఇది నిజమా లేక రూమరా అనేది ఇంకా క్లారిటీ లేదు.

కొన్ని రోజులుగా అకీరా సినీ ఎంట్రీపై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. అయితే అకీరానందన్‌కు మ్యూజిక్‌ అంటే ఇష్టమని రేణూదేశాయ్‌ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరానందన్‌ సంగీతం కూడా అందించాడు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ ఎక్స్‌లో పోస్ట్ చేసి..షార్ట్ ఫిల్మ్ లింక్‌ను కూడా షేర్ చేశాడు. ఇప్పుడు జూనియర్ పవర్‌ స్టార్‌ సినీ ఎంట్రీపై ఆసక్తికరమైన లీక్‌ బయటికి వచ్చింది. అంత వరకు నిజమో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు