Akira Nandan : సంగీత దర్శకుడిగా మారిన పవన్ తనయుడు.. సంగీతం వైపే ప్రయాణమా? అకిరా మ్యూజిక్ ఇచ్చిన సినిమా చూశారా?

అకిరా నందన్ పియానో వాయిస్తాడని, సంగీతంలో పలు విభాగాలు నేర్చుకున్నాడని అందరికి తెలుసు. రేణు దేశాయ్ అప్పుడప్పుడు అకిరా పియానో ప్లే చేసే వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

Akira Nandan : సంగీత దర్శకుడిగా మారిన పవన్ తనయుడు.. సంగీతం వైపే ప్రయాణమా? అకిరా మ్యూజిక్ ఇచ్చిన సినిమా చూశారా?

Pawan Kalyan son Akira Nandan Turned as Music Director

Updated On : April 13, 2023 / 9:40 AM IST

Akira Nandan :  పవన్(Pawan Kalyan) తనయుడిగా అకిరా నందన్(Akira Nandan) అందరికి పరిచయమే. అకిరాకు సొంత సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినా రేణు దేశాయ్(Renu Desai) అకిరా గురించి అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అకిరా కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడని పవన్ అభిమానులు భావిస్తున్నారు. కానీ సడెన్ గా అకిరా మ్యూజిక్ డైరెక్టర్(Music Director) అవతారం ఎత్తాడు.

అకిరా నందన్ పియానో వాయిస్తాడని, సంగీతంలో పలు విభాగాలు నేర్చుకున్నాడని అందరికి తెలుసు. రేణు దేశాయ్ అప్పుడప్పుడు అకిరా పియానో ప్లే చేసే వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల అకిరా పుట్టిన రోజు నాడు కూడా పియానో వాయిస్తున్న ఓ వీడియోని షేర్ చేసి అకిరా సంగీతం వినిపిస్తుంటే బాగుంటుంది అని తెలిపింది. గతంలో అకిరా తన స్కూల్ ఈవెంట్ లో RRR సినిమాలోని దోస్తీ పాటకు పియానో వాయించగా అది వైరల్ అయింది. తాజాగా అకిరా నందన్ సంగీత దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిలిం రిలీజయింది.

Director Sriwass : ఎన్టీఆర్, పవన్ నేను చెప్పిన కథలు బాగున్నాయన్నారు.. కానీ సినిమా ఛాన్సులు ఇవ్వలేదు..

ఒక రచయితకు సంబంధించిన కథాంశంతో కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వంలో రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కింది. ఈ సినిమాలో మనోజ్ అనే యువకుడు నటించాడు. ఈ షార్ట్ ఫిలింకు అకిరా నందన్ మ్యూజిక్ అందించాడు. నాలుగున్నర నిముషాలు ఉన్న ఈ షార్ట్ ఫిలింకు అకిరా అందించిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ షార్ట్ ఫిలింను షేర్ చేస్తూ అడివి శేష్ వీరికి అభినందనలు తెలిపారు. అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం అందించడంతో అకిరా సంగీతం వైపే ప్రయాణం చేస్తాడా? భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా? హీరోగా ఎంట్రీ ఇవ్వడా అని పవన్ అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు.