Pawan Kalyan : సురేందర్ రెడ్డితో పవన్ సినిమా ఆగిపోలేదు.. పవన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి సినిమా ఆగిపోలేదట. తాజాగా ఈ మూవీ కోసం ఒక ఆఫీస్ ని కూడా ఓపెన్ చేశారట.

Pawan Kalyan Surender Reddy movie is again on board
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత పలు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని చిత్రాలను పూర్తి చేసేశాడు. కొన్ని చేసే పనిలో ఉన్నాడు. ఇక హరిహరవీరమల్లు వంటి సినిమాలు మొదలైనా చిత్రీకరణ జరుపుకోలేని పరిస్థితిలో ఉంది. అలాగే గతంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ సురేంద్ర రెడ్డితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత మళ్ళీ ఆ మూవీ వార్త ఎక్కడా వినబడలేదు. అసలు ఉందా..? లేదా..? అని కూడా తెలియదు.
Ram Charan : రామ్ చరణ్ RC16లో చిరంజీవి కూడా నటిస్తున్నాడా..?
దీంతో చాలామంది ఆ సినిమా ఆగిపోయిందని అనుకున్నారు. అయితే ఆ మూవీ ఇంకా అలానే ఉంది. తాజాగా ఈ మూవీ కోసం ఒక ఆఫీస్ ని కూడా ఓపెన్ చేశారట. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఏదొక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ కి వెళ్ళడానికి మాత్రం కొద్దిగా టైమ్ పడుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్ చేతులో ఉన్న సినిమాలు పూర్తి చేసే సమయానికి ఏపీలో ఎన్నికలు వచ్చేస్తాయి. దీంతో పవన్ పొలిటికల్ వైపు షిఫ్ట్ అవుతాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.
Pawan Kalyan : పవన్ బర్త్ డేకి రెడీ అవుతున్న గిఫ్ట్స్.. ఏ సినిమా నుంచి ఏ అప్డేట్..?
ఈ గ్యాప్ లో సురేంద్ర రెడ్డి స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తుంది. తన గత సినిమా ‘ఏజెంట్’ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ స్క్రిప్ట్ పై జాగ్రత్త తీసుకుంటున్నాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి రేపు దర్శకనిర్మాతలు ఏమన్నా అప్డేట్స్ ఇస్తారా అనేది చూడాలి.