Godfather: గాడ్‌ఫాదర్ కోసం వీరమల్లు.. అభిమానులు గెట్ రెడీ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది.

Godfather: గాడ్‌ఫాదర్ కోసం వీరమల్లు.. అభిమానులు గెట్ రెడీ!

Pawan Kalyan To Grace Chiranjeevi Godfather Pre-Release Event

Updated On : September 7, 2022 / 6:34 PM IST

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Godfather Teaser: ట్రెండింగ్‌లో దుమ్ములేపుతున్న ‘గాడ్‌ఫాదర్’ టీజర్!

ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి కళ్లుచెదిరే రెస్పాన్స్ దక్కడంతో, ఈ సినిమాను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi Godfather Teaser: గాడ్‌ఫాదర్.. బాసులకే బాసు.. కుమ్మేశాడు!

ఈ వార్త నిజమైతే మెగా అభిమానులతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమని చెప్పాలి. ఒకే స్టేజీపై మరోసారి చిరు, పవన్‌లను చూడటానికి రెండు కళ్లు చాలవని వారు అంటున్నారు. మరి నిజంగానే గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ కోసం హరిహర వీరమల్లు వస్తాడా.. లేదా అనేది చూడాలి. ఇక గాడ్‌ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అందరిలో అదిరిపోయే హైప్ క్రియేట్ అయ్యింది.