Pawan Kalyan: దీక్ష చేపట్టిన పవన్.. ఇలా అయితే ఎలా స్వామీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టి అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలను సైతం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు....

Pawan Kalyan To Undertake Chaturmasya Deekhsa
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టి అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలను సైతం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పవన్, ఈ సినిమా షూటింగ్ ను అతి త్వరలో ముగించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో పాటు తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు కూడా పవన్ రెడీ అయ్యాడు. అటు హరీష్ శంకర్ తో కలిసి భవదీయుడు భగత్ సింగ్ సినిమాను అనౌన్స్ చేసి పట్టాలెక్కించాడు పవన్.
Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?
కానీ ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తవుతాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అక్టోబర్ నుండి పవన్ రాజకీయాలకే పరిమితం కానున్నాడు. ఆయన పాదయాత్రను చేపట్టేందుకు రెడీ అవుతుండటంతో ఈలోపే ఈ సినిమాలన్నీ పూర్తి చేయాల్సి ఉంది. కానీ అది సాధ్యమయ్యేలా మాత్రం కనిపించడం లేదు. హరిహర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ ముగించుకోలేదు.. హరీష్ శంకర్, సముద్రఖని సినిమాల్లో ఆయన ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు.. దీంతో ఈ మూడు సినిమాలు కూడా అక్టోబర్ వరకు పూర్తవుతాయా అనేది ఇప్పుడు అందరిలో సందేహాన్ని రేకెత్తిస్తోంది.
Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!
ఇక తాజాగా పవన్ ఇప్పుడు అందరికీ మరో షాక్ ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ధార్మిక దీక్ష చేపట్టారు. తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో పవన్ ఈ దీక్షలో ఉంటారు. ఈ నాలుగు నెలలు కూడా పవన్ చాలా నిష్టగా ఉంటారు. దీంతో ఈ దీక్షలో ఉంటూ పవన్ ఏం చేయబోతున్నారు, షూటింగ్స్, రాజకీయాలు ఎలా నడపబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పవన్ ఇలా అందరికీ షాకివ్వడంతో ఆయన్న నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ టెన్షన్ పడుతున్నారట.