Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి చేస్తున్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఇంకా షూటింగ్ ముగించుకోలేదు....

Pawan Kalyan: మెగా కాంబో మూవీ షురూ అయ్యేది అప్పుడే..!

Pawan Kalyan Sai Dharam Tej Movie To Kick Start Regular Shoot

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి చేస్తున్న సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఇంకా షూటింగ్ ముగించుకోలేదు. ఇక ఈ సినిమాతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఇదిలా ఉండగా, మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి పవన్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు సినిమాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈ లోపే మరో మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా నుండి ఆ స్టార్ బ్యూటీ తప్పుకుందా..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ఓ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘వినోదయ సీతం’ను తెలుగులో రీమేక్ చేసేందుకు విలక్షణ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని రెడీ అయ్యారు. ఈ సినిమాలో పవన్, సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూట్‌కు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

Vinodhaya Sitham: మేనల్లుడితో పవన్.. స్వీయ నిర్మాణంలో రీమేక్?

‘వినోదయ సీతం’ చిత్ర రీమేక్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను జూలై రెండవ వారంలో స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. తొలుత సాయి ధరమ్ తేజ్‌కు సంబంధించిన సీన్స్‌ను షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా కోసం పవన్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇతర నటీనటులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేయనుంది.