Satyagrahi : ఆగిపోయిన సినిమాపై పవన్ ట్వీట్ వైరల్

తన దర్శకత్వంలో చెయ్యాలనుకుని, అనివార్య కారణాలతో ఆపేసిన ‘సత్యాగ్రహి’ సినిమా గురించి పవన్ అభిప్రాయం ఏంటంటే..

Satyagrahi : ఆగిపోయిన సినిమాపై పవన్ ట్వీట్ వైరల్

Satyagrahi

Satyagrahi: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ సినిమా గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 2003లో పవన్ దర్శకత్వంలో, ‘ఖుషి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీసూర్య మూవీస్ బ్యానర్ మీద అగ్రనిర్మాత ఏ.ఎమ్. రత్నం ‘సత్యాగ్రహి’ సినిమాను అనౌన్స్ చేశారు.

Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు

2003లో అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఓపెనింగ్ కూడా చేశారు. దర్శకరత్న దాసరి క్లాప్, విక్టరీ వెంకటేష్ కెమెరా స్విఛ్చాన్, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనివార్య కారణాలతో సినిమాను పక్కన పెట్టేశారు.

Satyagrahi Opening

 

దాదాపు 18 ఏళ్ల తర్వాత పవన్ ‘సత్యాగ్రహి’ గురించి గుర్తు చేసుకున్నారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ కాలంలో జరిగిన ఎమర్జెన్సీ ఉద్యమం నుండి స్పూర్తి పొంది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేద్దామనుకున్న సినిమా.. సినిమాలో నటించడం కంటే కూడా ఇంకా టాక్ నడుస్తుండడం మరింత సంతృప్తినిస్తుంది అంటూ పవన్ ట్వీట్ చేశారు.