Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. సెప్టెంబర్‌ ఫస్ట్ వీక్‌లో..

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మాసివ్ అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్‌ ఫస్ట్ వీక్‌లో..

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. సెప్టెంబర్‌ ఫస్ట్ వీక్‌లో..

Pawan Kalyan Ustaad Bhagat Singh shoot starts from september first week

Updated On : August 25, 2023 / 2:01 PM IST

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కొన్ని రోజులు పాటు సినిమా షూటింగ్స్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయ్యాడు. బ్రో మూవీ రిలీజ్ తరువాత నుంచి పొలిటికల్ అప్డేట్స్ తప్ప సినిమా అప్డేట్స్ ఏమి రాకపోవడంతో.. OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాల షూటింగ్ సంగతి ఏంటని అభిమానులంతా కొంత నిరాశ చెందారు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అయితే.. మూవీ ఆగిపోయింది అంటూ కూడా ప్రచారం జరిగింది.

Gandeevadhari Arjuna Trailer : గాంఢీవధారి అర్జున ఫైనల్ ట్రైలర్‌ రిలీజ్.. ఈసారి యాక్షన్‌తో..

ఈ వార్తలతో పవన్ ఫ్యాన్స్ చాలా కంగారుపడ్డారు. సోషల్ మీడియాలో దర్శకుడు హరీష్ శంకర్ ని ఆ వార్తలు నిజమేనా? అని ప్రశ్నించినా బదులు రాకపోవడంతో ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఆ రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతూ మాసివ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 5 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో ఇటీవల వేసిన ఒక పెద్ద సెట్ లో సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు వెల్లడించారు.

Akira Nandan : అకీరా నందన్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. వెంటనే డెలీట్ చేశారు.. ఎందుకు..?

ఇక ఈ న్యూస్ తెలియజేస్తూ పవన్ సెట్స్ లో పోలీస్ డ్రెస్ లో ఉన్న ఒక పిక్ ని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. మూవీ షూటింగ్ మొదలవుతుందని తెలియడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ ఫీల్ అవుతున్నారు. ఇక OG మూవీ విషయానికి వస్తే.. అక్టోబర్ అండ్ నవంబర్ లో కాల్ షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. అక్టోబర్ షెడ్యూల్ బ్యాంకాక్ లో ఉండబోతుందట. అది కూడా 20 రోజుల షెడ్యూల్ తో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. చూస్తుంటే పవన్ ఈసారి పాలిటిక్స్ కి బ్రేక్ ఇచ్చి సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.