Pawan Kalyan: కన్నడ డైరెక్టర్‌తో పవన్.. బాక్సాఫీస్‌ను ‘కబ్జా’ చేసేందుకు రెడీ అవుతున్నారా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అటు పొలిటికల్‌గానూ పవన్ చాలా బిజీగా ఉండటం.. సమయం దొరికినప్పుడల్లా సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తూ అభిమానుల్లో తన సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నాడు. పవన్ ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి తమిళ మూవీ ‘వినోదయ సీతం’ రీమేక్‌లోనూ నటిస్తున్నాడు.

Pawan Kalyan: కన్నడ డైరెక్టర్‌తో పవన్.. బాక్సాఫీస్‌ను ‘కబ్జా’ చేసేందుకు రెడీ అవుతున్నారా..?

Pawan Kalyan With Kannada Director Chandru Makes Headlines

Updated On : March 17, 2023 / 1:50 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అటు పొలిటికల్‌గానూ పవన్ చాలా బిజీగా ఉండటం.. సమయం దొరికినప్పుడల్లా సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తూ అభిమానుల్లో తన సినిమాలపై అంచనాలను పెంచేస్తున్నాడు. పవన్ ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి తమిళ మూవీ ‘వినోదయ సీతం’ రీమేక్‌లోనూ నటిస్తున్నాడు.

Pawan Kalyan : వినోదాయ సిత్తం రీమేక్ సినిమాకు పవన్ ఎంత తీసుకుంటున్నాడో చెప్పేశాడు.. 25 రోజులకు మరీ అంత ఎక్కువా ?

ఇక ఈ రెండు సినిమాలతో పాటు దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో ‘OG’ అనే మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న పవన్, ఇప్పుడు మరో డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చాడా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తాజా చిత్రం ‘కబ్జ’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు చంద్రు తాజాగా పవన్ కల్యాణ్‌ను కలిశారు.

Pawan Kalyan : OMG.. సినిమాకు ఎంత తీసుకుంటాడో చెప్పేసిన పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా ఆయన కబ్జ చిత్రానికి సంబంధించి కొన్ని సీన్స్, గ్లింప్స్‌లు పవన్‌కు వివరించారు. అవి చూసిన పవన్ చంద్రు డైరెక్షన్‌కు ఇంప్రెస్ అయ్యాడట. ఇక ఈ డైరెక్టర్‌తో పవన్ త్వరలోనే ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని చంద్రు ఓ స్టోరీలైన్ వినిపించాడని.. దానికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి నిజంగానే ఈ కన్నడ డైరెక్టర్‌తో బాక్సాఫీస్‌ను ‘కబ్జా’ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.