Pawan Kalyan : OMG.. సినిమాకు ఎంత తీసుకుంటాడో చెప్పేసిన పవన్ కల్యాణ్

నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకు రోజుకు రూ.2 కోట్లు. అంటే, 20-25 రోజులు పని చేస్తే దాదాపు రూ.45కోట్లు తీసుకుంటా. అంటే, ప్రతి సినిమాకు అంత ఇచ్చేస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. మీరిచ్చిన స్థాయి అది. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. నాకు డబ్బుల అవసరం ఏముంది? నాకు డబ్బుపై వ్యామోహం లేదు. నేను డబ్బు సంపాదించుకోలేనా? నేను చూడని సుఖాలు లేవు'' అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు.

Pawan Kalyan : OMG.. సినిమాకు ఎంత తీసుకుంటాడో చెప్పేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan : పవన్ కల్యాణ్.. సినిమాల్లో పవర్ స్టార్ గా తనదైన ముద్ర వేశారు. ఇటు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. జనసేన పార్టీతో ప్రజల్లోకి వెళ్లారు పవన్ కల్యాణ్. అసెంబ్లీ ఎన్నికలను పవన్ టార్గెట్ చేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ పొలిటికల్ లైఫ్ గురించి కాసేపు పక్కన పెడితే.. సినిమాలకు సంబంధించి ఆయన అభిమానులతో పాటు అంతా తెలుసుకోవాలని ఆత్రుతపడే విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. అసలే పవర్ స్టార్. ప్రముఖ నటుడు. టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరు. అలాంటి పవన్ కల్యాణ్.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారు? ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, దీని గురించి స్వయంగా పవన్ కల్యాణే రివీల్ చేశారు. తాజాగా తాను చేస్తున్న సినిమాకు, రోజుకు ఎంత డబ్బు తీసుకుంటాడో స్వయంగా పవన్ కల్యాణే చెప్పేశారు. పవన్ కల్యాణ్ చెప్పిన అమౌంట్ విని అంతా విస్తుపోతున్నారు.

Also Read..Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

ఇప్పుడు చేస్తున్న సినిమాకు ఒక్కో రోజుకు పవన్ కల్యాణ్ ఏకంగా రూ.2కోట్లు తీసుకుంటారట. ఏంటి? షాక్ అయ్యారు కదూ. కానీ, ఇది నిజం. స్వయంగా పవనే ఈ విషయాన్ని చెప్పారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆ సమయంలో సినిమాకు తాను ఎంత అమౌంట్ తీసుకుంటానో పవన్ స్వయంగా చెప్పారు. ఇంతకీ ఏ సందర్భంలో పవన్ అలా చెప్పాల్సి వచ్చింది అంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.వెయ్యి కోట్లు ఆఫర్ చేశారన్న ప్రచారంపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆ క్రమంలో ఆయన ఒక్కో సినిమాకు ఎంత డబ్బు తీసుకుంటారు అనేది రివీల్ చేశారు. ” కేసీఆర్.. నాకు వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని అంటున్నారు. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా.

పవన్ కు వెయ్యి కోట్లు కాదు రూ.10వేల కోట్లు ఆఫర్ చేశారు అని అనుండాల్సింది. వినడానికి కూడా బాగుండేది. నిజంగా మిమ్మల్ని, మీ ఓట్లను డబ్బుతో కొనగలనా? చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. డబ్బులతో అధికారంలోకి రాగలనా? మీ గుండెల్లో స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకం అవుతాను. వెయ్యి కోట్లు ఇచ్చారు. ప్యాకేజీలు తీసుకున్నారు. అంటే ఊరుకోను.

Also Read..Pawan Kalyan : దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం, త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం-పవన్ కల్యాణ్

నేను వేసుకునే చెప్పులు ఫారిన్ బ్రాండ్ కాదు. జనాల్లో ఉండే వ్యక్తి స్వయంగా చేసిన చెప్పులు అవి. మరోసారి నన్ను ప్యాకేజీ స్టార్ అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చాలా గట్టి చెప్పు దెబ్బ పడుద్ది.

డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాను నేను. అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడినే తప్పా.. డబ్బులకు ఆశపడే వాడిని కాను. నాకు డబ్బు అవసరం లేదు. నేను ధైర్యంగా చెబుతున్నా. నేను చేస్తున్న సినిమా.. 22 రోజులు చేస్తున్నా.. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకు రోజుకు రూ.2 కోట్లు. అంటే, 20-25 రోజులు పని చేస్తే దాదాపు రూ.45కోట్లు తీసుకుంటా. అంటే, ప్రతి సినిమాకు అంత ఇచ్చేస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. మీరిచ్చిన స్థాయి అది. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. నాకు డబ్బుల అవసరం ఏముంది? నాకు డబ్బుపై వ్యామోహం లేదు. నేను డబ్బు సంపాదించుకోలేనా? నేను చూడని సుఖాలు లేవు” అని పవన్ కల్యాణ్ ఆవేశంగా అన్నారు.