Payal Ghosh : ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్తాడు అంటే నవ్వారు.. ఇప్పుడు ఏమైంది.. పాయల్ ఘోష్!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఈ ఏడాది గట్టిగానే గర్జించాడు. ఇక ఈ మూవీకి ఫారిన్ కంట్రీస్ లో కూడా ఆదరణ పెరగడంతో.. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అయితే బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. ఎన్టీఆర్ కి వచ్చిన గ్లోబల్ గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Payal Ghosh : ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్తాడు అంటే నవ్వారు.. ఇప్పుడు ఏమైంది.. పాయల్ ఘోష్!

Payal Ghosh about ntr

Updated On : December 24, 2022 / 1:26 PM IST

Payal Ghosh : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఈ ఏడాది గట్టిగానే గర్జించాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీకి ఫారిన్ కంట్రీస్ లో కూడా ఆదరణ పెరగడంతో.. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ కి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వస్తుంది. RRR లో తన నటన చూసి హాలీవుడ్ అభిమానులు కూడా ఫిదా అయ్యిపోతున్నారు.

NTR: అమెరికాలో తారక్ అజ్ఞాతం.. ఎక్కడున్నాడో కూడా తెలియదట!

తారక్ నటనకి ఆస్కార్ కి సైతం నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ విదేశీ మీడియాలు, పేపర్లు రాసుకొచ్చాయి. అయితే బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. ఎన్టీఆర్ కి వచ్చిన గ్లోబల్ గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఈ భామ, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో తమన్నాకి స్నేహితురాలిగా నటించింది. ఆ సమయంలో తారక్ నటన చూసి అభిమాని అయ్యిపోయింది.

కాగా పాయల్ ఘోష్ తన ట్విట్టర్‌లో.. “ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి చేరుకుంటాడు అని నేను 2020లో చెబితే, అందరూ నవ్వారు. ఇప్పుడు ఏమైంది, నేను చెప్పింది నిజమే అయ్యింది కదా” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రెజెంట్ ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరీలో NTR30 షూటింగ్ మొదలుపెట్టనున్నాడు.