Rakshana Trailer : రక్షణ ట్రైలర్ వచ్చేసింది.. పాయల్ రాజ్ పుత్ అదరగొట్టేసిందిగా..

తాజాగా రక్షణ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Rakshana Trailer : రక్షణ ట్రైలర్ వచ్చేసింది.. పాయల్ రాజ్ పుత్ అదరగొట్టేసిందిగా..

Payal Rajput Rakshana Movie Trailer Released

Updated On : June 1, 2024 / 6:33 PM IST

Rakshana Trailer : పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు ‘రక్షణ’ అంటూ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోష‌న్‌, మాన‌స్, రాజీవ్ కనకాల.. పలువురు ముఖ్య పాత్రల్లో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించబోతుంది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాని నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.

Also Read : Chandini Chowdary : ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న హీరోయిన్.. అలా కుదిరిందా?

ఆల్రెడీ ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పగా తాజాగా రక్షణ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో పాయల్ ఓ కేసు డీల్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టు చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాయల్ అదరగొట్టింది అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ మొదట్లో పోలీస్ గా ప్రమాణం చేస్తూ చెప్పిన మాటలు చివర్లో క్రైం ఫ్రీ సిటీ కావాలి అనేది రికార్డ్స్ లోనా రియాలిటీలోనా అంటూ ప్రశ్నించే డైలాగ్.. ఇలా పాయల్ తన యాక్టింగ్ తో మరోసారి మెప్పించింది. మీరు కూడా రక్షణ ట్రైలర్ చూసేయండి..

ప్రస్తుతం రక్షణ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. పోలీసాఫీసర్ గా పాయల్ రాజ్‌పుత్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.