Peddi : ‘పెద్ది’లో కొత్త సీన్స్.. మళ్ళీ థియేటర్స్ కి ఫ్యాన్స్..
ఇటీవల బుచ్చిబాబు స్వయంగా జాన్వీ కపూర్ కి చెందిన కొన్ని సీన్స్ డిలీట్ చేస్తామని ప్రకటించారు. (Peddi)
Peddi
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు దాదాపు 315 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా చాలా బాగున్నప్పటికీ, ఒక స్ఫూర్తినిచ్చే కథ అయినా, చరణ్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టినా కొన్ని జాన్వీ కపూర్ సీన్స్ పై విమర్శలు వచ్చాయి. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అంటూ విమర్శలు వచ్చాయి.
ఇటీవల బుచ్చిబాబు స్వయంగా జాన్వీ కపూర్ కి చెందిన కొన్ని సీన్స్ డిలీట్ చేస్తామని ప్రకటించారు. అయితే ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ కూడా సినిమాలో లేవు. దీంతో మరోసారి పెద్ది సినిమాని ఎడిటింగ్ టేబుల్ వద్దకు తీసుకొచ్చారు.
Also Read : Peddi : క్రేజ్ ఉంది కానీ కలెక్షన్స్ ఏవి..? పెద్ది విషయంలో ఏం జరిగింది..?
జాన్వీ కపూర్ అభ్యంతకర సీన్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో గౌరి నాయుడు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కట్ చేస్తున్నారట. అలాగే జగపతి బాబు సీన్స్, చరణ్ సీన్స్ ఇంకొన్ని జత చేసి సినిమా కథకు హెల్ప్ అయ్యేలా మార్చబోతున్నారట. జగపతి బాబు చెప్పినట్టు చరణ్ – జగపతి బాబు సీన్స్ ని కూడా యాడ్ చేయబోతున్నారు. ఎడిటింగ్ చేసి మళ్ళీ సెన్సార్ కి కూడా పంపించబోతున్నారు పెద్ది సినిమాని.
మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాని సెన్సార్ చేసి కొత్త వర్షన్ ని థియేటర్స్ లోకి తీసుకు రానున్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఆ కొత్త సీన్స్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొత్తగా యాడ్ చేసే సీన్స్ తో మరోసారి థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం ఖాయం అంటున్నారు మూవీ యూనిట్.
