Peddi : క్రేజ్ ఉంది కానీ కలెక్షన్స్ ఏవి..? పెద్ది విషయంలో ఏం జరిగింది..?
అయితే క్రేజ్ భారీగా ఉంది కానీ కలెక్షన్స్ లేవు అంటున్నారు. (Peddi)
Peddi
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి హిట్ టాక్ తో నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. చరణ్ కి RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ బాగా వచ్చిన సంగతి తెలిసిందే.
RRR సినిమా తర్వాత చరణ్ నార్త్ ఇండియాకు ఎప్పుడు వెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు. RRR క్లైమాక్స్ లో రామ్ చరణ్ సీతారామరాజులా రాముడి రూపంలో కనిపించడంతో నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. అసలు నార్త్ లో చరణ్ క్రేజ్ చూసి సౌత్ స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయారు. అయితే క్రేజ్ భారీగా ఉంది కానీ కలెక్షన్స్ లేవు అంటున్నారు.
Also Read : 29 Movie Review : ’29’ మూవీ రివ్యూ.. అబ్బాయిలు కచ్చితంగా చూడాల్సిన సినిమా..
ఇప్పటివరకు నార్త్ లో పెద్ది సినిమాకు కేవలం 20 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని టాక్. నార్త్ లో ఈ సినిమా 25 కోట్లకు అమ్ముడయింది. కనీసం 50 కోట్లు గ్రాస్ అయినా తీసుకురావాలి. అసలు ఇలాంటి పాన్ ఇండియా సినిమాకు ఈ పాటికే 50 కోట్లకు పైగా నార్త్ లో వచ్చేయాలి కానీ రాలేదు.
పెద్ది సినిమాపై బాలీవుడ్ మీడియా నెగిటివ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ సీన్స్ ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఈ సినిమాని నార్త్ లో నెగిటివ్ చేసారు. ఇది పెద్దిపై బాగా ఎఫెక్ట్ అయింది. అలాగే ప్రమోషన్స్ అక్కడక్కడా కొన్ని ఈవెంట్స్ భారీగా నిర్వహించారు కానీ అవి జనాల్లోకి వెళ్ళలేదు అని సమాచారం. జాన్వీ కూడా బాలీవుడ్ లో ఈ సినిమాని తన సినిమా అని భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేయకపోవడం గమనార్హం.
Also Read : Allu Arjun : పెద్ది మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. నా సోదరుడిని చూసి గర్వపడుతున్నా..
పెద్ది సినిమాలో కుస్తీ, రన్నింగ్.. లాంటి నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే స్పోర్ట్స్ సీన్స్ ఉన్నా ఈ సినిమాని నార్త్ వాళ్ళు ఎక్కువగా చూడకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. అయితే పెద్దినే కాదు అంతకుముందు గేమ్ చెంజర్ సినిమాకు కూడా నార్త్ లో కలెక్షన్స్ ఆశించినట్టు రాలేదు. కొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా అని చెప్పుకొని ఇటీవల నార్త్ లో రిలీజ్ చేస్తున్న తెలుగు సినిమాల పరిస్థితి ఇంతే. క్రేజ్ చూస్తే ఆకాశాన్ని అంటుంతుంది. కానీ రియల్టీలో కలెక్షన్స్ విషయానికొస్తే అథః పాతాళమే అన్నట్టు ఉంది కొన్ని తెలుగు పాన్ ఇండియా సినిమాల పరిస్థితి. పెద్ది కి ఈ విషయంలో బాలీవుడ్ చూపిస్తున్న నెగిటివిటి కూడా తోడవడంతో ఇంకా ఎఫెక్ట్ అయింది.
