Pelli Sandadi : వివాదంలో ‘పెళ్లి సందD’ హీరోయిన్.. తను నా కూతురు కాదంటూ..

ఈ 'పెళ్లి సందD' హీరోయిన్‌ శ్రీలీల ఓ వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు. ఈ విషయంపై ఆయన మీడియా ముందు

Pelli Sandadi : వివాదంలో ‘పెళ్లి సందD’ హీరోయిన్.. తను నా కూతురు కాదంటూ..

Sri Leela

Updated On : October 17, 2021 / 2:11 PM IST

Pelli Sandadi :  రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా పరిచయమవుతూ వచ్చిన సినిమా ‘పెళ్లి సందD’. ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్ గా చేసిన శ్రీలీల తెలుగులో మంచి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా గలగలా మాట్లాడుతూ చిరంజీవితో పాటు ప్రేక్షకులని కూడా మెప్పించింది.

SPIRIT: క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో బెబో

అయితే ఈ ‘పెళ్లి సందD’ హీరోయిన్‌ శ్రీలీల ఓ వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు. ఈ విషయంపై ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. శ్రీలీల నా కూతరు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్‌ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేశాను అని వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు. మరి ఈ వివాదంపై శ్రీలీల కానీ ఆమె తల్లి కానీ స్పందించలేదు.