Perni Nani: ‘రాజమౌళి, దానయ్యలు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడలేదు’
సీఎం జగన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి, బడా నిర్మాత దానయ్యలు భేటీ అయ్యారు. ఈ సమావేశం గురించి ఏపీ మంత్రి పేర్ని నాని ఇలా వివరించారు. కొత్త జీవో పట్ల థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే రాజమౌళి

Parni Nani
Perni Nani: సీఎం జగన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి, బడా నిర్మాత దానయ్యలు భేటీ అయ్యారు. ఈ సమావేశం గురించి ఏపీ మంత్రి పేర్ని నాని ఇలా వివరించారు. కొత్త జీవో పట్ల థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే రాజమౌళి, దానయ్య వచ్చారని అన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు.
‘ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎలాంటి చర్చ జరగలేదు. పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకే మా ప్రభుత్వం ఉంది. సినిమా రిలీజ్ ఉంటేనే సినీ పరిశ్రమలో పెద్ద కలుస్తారా.. అలాంటి అవసరమేమీ లేదు. సినిమా టిక్కెట్లు బ్లాక్ లో అమ్మడాన్ని అడ్డుకోవడం కోసమే సీఎం జగన్ కొత్త జీవో తెచ్చారు’
‘సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు షోలకు ఎప్పుడూ అనుమతి ఉంటుంది. పెద్ద సినిమాలకు వేసినప్పుడు చిన్న సినిమాకు కూడా అవకాశం ఇవ్వాల్సిందే. స్వచ్ఛంద సంస్థల కోసం బెనిఫిట్ వేయాలనుకుంటే దాని గురించి కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది’
Read Also: చర్చలతోనే సమస్యకు పరిష్కారం: పేర్ని నాని
‘రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మంచి చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని గమనించాలి’ అని పేర్ని నాని వెల్లడించారు.