Guppedantha Manasu : శైలేంద్రను కొట్టిన ఫణీంద్ర..జగతి చావుకి ఫణీంద్ర, దేవయాని కారణమని ఫణీంద్రకు తెలిసిపోయిందా?

దేవయాని, ఫణీంద్ర మహేంద్ర కుటుంబంపై చేస్తున్న కుట్రలను వింటాడు ఫణీంద్ర. శైలేంద్ర చెంప పగలగొడతాడు. జగతి చావుకి కారణం దేవయని, శైలేంద్ర అని ఫణీంద్రకు తెలిసిపోయిందా?

Guppedantha Manasu : శైలేంద్రను కొట్టిన ఫణీంద్ర..జగతి చావుకి ఫణీంద్ర, దేవయాని కారణమని ఫణీంద్రకు తెలిసిపోయిందా?

Guppedantha Manasu today 3

Updated On : November 16, 2023 / 1:03 PM IST

Guppedantha Manasu : అనుపమ ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్‌లో మహేంద్ర కుటుంబాన్ని కలిసిందని కొడుకు శైలేంద్రకు చెబుతుంది దేవయాని. వాళ్లు కలిసారంటేనే తనకు భయం వేస్తోందని అంటుంది. తల్లికి శైలేంద్ర ధైర్యం చెబుతుండగా ఫణీంద్ర వారి మాటలు వింటాడు. ఆ తరువాత ‘ గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu : రిషి చెప్పిన నిజాలు విని షాకైన విశ్వనాథం, ఏంజెల్.. కట్టుకథ అంటూ గేలి చేసిన ఏంజెల్

ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో మహేంద్ర కుటుంబాన్ని అనుపమ కలిసిందని కొడుకు శైలేంద్రకు చెబుతుంది దేవయాని. జగతి అంటే అనుపమకి చాలా ఇష్టమని తన చావుకి మనమే కారణమని తెలిస్తే వదిలిపెట్టదని అంటుంది. రిషి వాళ్లు మనతో ఉండకపోవడం వల్ల మనకు ఏ విషయాలు తెలియట్లేదని అంటుంది. తల్లిని కంగారు పడొద్దని అన్నిటికీ తానున్నానని శైలేంద్ర చెబుతాడు. వాళ్లిద్దరి మాటలు విన్న ఫణీంద్ర శైలేంద్ర చెంప పగలగొడతాడు. అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారని నిలదీస్తాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే తీవ్రవాదులు రహస్యంగా కుట్రలు పన్నుతున్నట్లు ఉందని అంటాడు. ధరణిని పిలిచి వీళ్లిద్దరూ మాట్లాడుకోకుండా చూడమని చెప్పాను కదా అని అడుగుతాడు. తన కళ్లుకప్పి వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారని ధరణి ఫణీంద్రతో అంటుంది.

Guppedantha Manasu today 1

Guppedantha Manasu today 1

ఇంట్లో జరుగుతున్న అన్ని అనర్ధాలకు మీరేకారణంగా అనిపిస్తోందంటాడు దేవయాని, శైలేంద్రలతో ఫణీంద్ర. జగతి చావు వెనుక కూడా మీ ఇద్దరి హస్తం ఏమైనా ఉందా? అని నిలదీస్తాడు. ఫణీంద్ర మాటలకు దేవయాని, శైలేంద్ర షాకవుతారు. అంతమాట అన్నారేంటని? భర్తని అడుగుతుంది దేవయాని. మీరు చేసే పనులు అలాగే ఉన్నాయంటాడు ఫణీంద్ర. పెళ్లై ఇన్ని సంవత్సరాలు అయినా భార్యతో ఒక్కరోజు సరదాగా లేవని.. లేదంటే ఈ పాటికి పిల్లలు కలిగేవారని.. నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఇక్కడ ఉండద్దని.. తిరిగి ఫారిన్ వెళ్లిపోమని శైలేంద్రకు ఫణీంద్ర వార్నింగ్ ఇస్తాడు. భార్యకు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు.

Guppedantha Manasu today 2

Guppedantha Manasu today 2

అనుపమ మహేంద్రకి ఫోన్ చేస్తుంటే కాల్ కట్ చేస్తాడు. అయినా అనుపమ ఆపకుండా ఫోన్ చేస్తుంటే ఫోన్ తీసి కాల్ కట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు మహేంద్ర. జగతిని చంపానని మాట్లాడావు కదా.. అలా ఎలా మాట్లాడావు అంటాడు. అరకు వచ్చినప్పుడైనా జగతి చనిపోయిందని తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది అనుపమ. చెప్పాలనిపించలేదు అంటాడు మహేంద్ర. జగతి చనిపోతే మీరందరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నిస్తుంది అనుపమ. జగతి విషయంలో తాను ఏదీ చెప్పలేనని.. ఆ విషయాన్ని వదిలేయమని అంటాడు మహేంద్ర. జగతి గురించి అడగటం కోసం తనకు ఫోన్ చేయద్దంటూ ఫోన్ పెట్టేస్తాడు. మహేంద్ర ప్రవర్తన అర్ధం కాక అనుపమ బాధపడుతుంది. మహేంద్ర ఇంటికి వెళ్లి జగతి గురించి పూర్తిగా తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. మహేంద్ర అనుపమతో ఫోన్‌లో మాట్లాడిన మాటలన్నీ వింటారు రిషి, వసుధర. తండ్రి అనుపమ పట్ల ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కావట్లేదని అనుకుంటారు.

Guppedantha Manasu : రిషి చెప్పిన నిజాలు విని షాకైన విశ్వనాథం, ఏంజెల్.. కట్టుకథ అంటూ గేలి చేసిన ఏంజెల్

లగేజ్‌తో బయలుదేరిన అనుపమని ఎక్కడికి వెళ్తున్నావని విశ్వనాథం అడుగుతాడు. తనని విడిచి వెళ్లదని అంటాడు. ఆరోగ్యం బాగోలేని విశ్వనాథంని విడిచి వెళ్లద్దని ఏంజెల్ కూడా అనుపమని బ్రతిమాలుతుంది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తాను తండ్రికి దూరంగా ఉన్నానని.. ఇకపై అలా జరగదని అంటుంది అనుపమ. ఆ తరువాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది? నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా కాపుగంటి రాజేంద్ర సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.