Jayam Ravi : పిల్లలతో కలిసి మా చిత్రాన్ని చూడొద్దు.. స్టారో హీరో రిక్వెస్ట్
జయం రవి (Jayamravi) నటించిన చిత్రం ‘ఇరైవన్’ (Iraivan). అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్.

Jayam Ravi Iraivan
Jayam Ravi Iraivan : జయం రవి (Jayamravi) నటించిన చిత్రం ‘ఇరైవన్’ (Iraivan). అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాని తెలుగులో గాడ్ (God) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ లాంఛ్‌లో హీరో జయం రవి మాట్లాడుతూ తమ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిందో క్లారిటీ ఇచ్చారు.
సాధారణంగా తాను అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందించే లక్ష్యంతో సినిమాలు చేస్తుంటానని చెప్పారు. అయితే.. ఇరైవన్ సినిమా మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దన్నారు. దీనికి ప్రధాన కారణం ఇది ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు పిల్లలు భయపడే అవకాశం ఉందన్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే ట్రైలర్‌లో చూపించినట్లు తెలిపారు. ఇలాంటి జోనర్ చిత్రాలను కొంత మంది ఇష్టపడతారని, అలాంటి వారికి తమ సినిమా తప్పకుండా నచ్చుతుందన్నారు.
Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. సలార్ వచ్చేస్తున్నాడు.. ఆ పండక్కే రిలీజ్..
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి మాట్లాడారు. లోకేశ్ కనగరాజ్ గతంలో తనకు ఓ స్టోరీ చెప్పారని అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయినట్లు చెప్పారు. అతడు ఒక గొప్ప దర్శకుడు అని, అతడికి మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక తనకు డైరెక్షన్ పై ఆసక్తి ఉందని, భవిష్యత్తులో అవకాశం వస్తే విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ఓ సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు జయం రవి తెలిపారు.