పేకాట, బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని ప్రముఖ నటుడు అరెస్ట్

ప్రముఖ సినీ నటుడు శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్యామ్, చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్నాడు. కాగా, క్లబ్ లో గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పేకాట, బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాడని తెలిపిన పోలీసులు శ్యామ్ పై కేసు నమోదు చేశారు. శ్యామ్.. తెలుగు, తమళ సినిమాల్లో నటించాడు. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్-2 వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు. కిక్ సినిమా తర్వాత తెలుగు జనాల్లో కిక్ శ్యామ్ గా గుర్తింపు పొందాడు.
శామ్ పూర్తి పూరు మొహమ్మద్ షమ్‌షుద్దీన్ ఇబ్రహీం. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్యామ్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజిగా మారాడు. 2001 నుంచి అతడు పలు సినిమాల్లో యాక్ట్ చేశాడు. 2009లో వచ్చిన కిక్ సినిమా శ్యామ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ మూవీ తర్వాత అతడి పేరు కూడా కిక్ శామ్‌గా మారింది. తెలుగు ప్రేక్షకుల్లో అతడు అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు. పేకట, బెట్టింగ్ నిర్వహిస్తున్నాడంటూ పోలీసులు శ్యామ్ ను అరెస్ట్ చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారం వారిని షాక్ కి గురి చేసింది. అసలేం జరిగింది అని సినీ పరిశ్రమకు చెందిన వారు దీని గురించి ఆరా తీస్తున్నారు.