Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్.. షణ్ముఖ్ అన్న కోసం పోలీసులు వెళ్తే..

తాజాగా పోలీసులు షణ్ముఖ్ అన్న కోసం ఓ కేసు విషయంలో వెళ్లగా షణ్ముఖ్, అతని అన్న సంపత్ గంజాయితో అడ్డంగా దొరికిపోయారు.

Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడ్డ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్.. షణ్ముఖ్ అన్న కోసం పోలీసులు వెళ్తే..

Shanmukh Jaswanth Caught With Ganja

Updated On : February 22, 2024 / 12:52 PM IST

Shanmukh Jaswanth : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ తెలుగులో అత్యధిక సబ్ స్క్రైబర్స్ తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డ్ కూడా సాధించాడు. తాజాగా పోలీసులు షణ్ముఖ్ అన్న కోసం ఓ కేసు విషయంలో వెళ్లగా షణ్ముఖ్, అతడి అన్న సంపత్ గంజాయితో అడ్డంగా దొరికిపోయారు.

షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్‌కి కొన్ని రోజుల్లో వివాహం కానుంది. అయితే మోనికా అనే అమ్మాయి తనని పదేళ్లుగా ప్రేమించి ఇప్పుడు తనని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి హెసుకోబోతున్నాడు అంటూ సంపత్ పై కేసు పెట్టగా.. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇంటికి వెళ్తే అక్కడ అన్నదమ్ములు ఇద్దరూ గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి దాదాపు 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

Also Read : ‘ఓం భీమ్ బుష్’ అంటున్న శ్రీవిష్ణు.. ఆ ఇద్దరితో కలిసి మళ్ళీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడుగా..

అయితే సంపత్ ని, గంజాయి విషయంలో షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో షణ్ముఖ్ హిట్ & రన్ కేసులో వైరల్ అవ్వగా ఇప్పుడు ఇలా గంజాయితో పోలీసులకు పట్టుబడి షణ్ముఖ్ జశ్వంత్ వార్తల్లో నిలిచాడు.