Posani Krishna Murali : తమిళ్ వాళ్ళని పొగుడుతూనే.. తమిళ ఇండస్ట్రీ నిర్ణయాలపై.. రోజా భర్తపై పోసాని కామెంట్స్..

తాజాగా తమిళ పరిశ్రమ నిర్ణయాలపై పోసాని కామెంట్స్ చేశారు. నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతుండటంతో వచ్చిన పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడారు.

Posani Krishna Murali : తమిళ్ వాళ్ళని పొగుడుతూనే.. తమిళ ఇండస్ట్రీ నిర్ణయాలపై.. రోజా భర్తపై పోసాని కామెంట్స్..

Posani Krishna Murali comments on Tamil Film Industry and RK Selvamani

Updated On : July 30, 2023 / 9:57 AM IST

Posani Krishna Murali : ఇటీవల తమిళ పరిశ్రమ వాళ్ళ సినిమాల్లో తమిళ వాళ్ళే ఉండాలి, తమిళనాడులోనే షూటింగ్ చేయాలి, తమిళ్ వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పలు రూల్స్ ని తీసుకొచ్చారు. తమిళ్ డైరెక్టర్, రోజా భర్త, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడు RK సెల్వమణి ఈ రూల్స్ ని ప్రవేశపెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. ఇవి పాటించని వాళ్లపై చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. అయితే ఇటీవల పాన్ ఇండియా సినిమాలు, అందరు యాక్టర్స్ అన్ని పరిశ్రమలలో నటిస్తూ సినిమాలు హై రేంజ్ కి వెళ్తున్నాయి.

ఇలాంటి సమయంలో తమిళ పరిశ్రమ ఈ రూల్స్ తేవడం కరెక్ట్ కాదని అన్ని సినీ పరిశ్రమల నుంచి విమర్శలు వస్తున్నాయి. కొంతమంది తమిళ్ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాలపై ఇటీవల పవన్ కళ్యాణ్ బ్రో ఈవెంట్లో మాట్లాడుతూ ఇవి తప్పని విమర్శించారు. తమిళ్ వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదని, ఎంతో మంది యాక్టర్స్ అక్కడికి వచ్చి చేస్తున్నారు, ఇక్కడ కూడా తమిళ్ వాళ్ళు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

TFCC Elections 2023 : తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఎలక్షన్స్ లైవ్.. దిల్ రాజు వర్సెస్ సి కళ్యాణ్.. ఇక్కడ చూడండి..

తాజాగా తమిళ పరిశ్రమ నిర్ణయాలపై పోసాని కామెంట్స్ చేశారు. నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతుండటంతో వచ్చిన పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమిళ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాల గురించి, రోజా భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యల గురించి అడగగా పోసాని మాట్లాడుతూ.. తమిళ్ వాళ్ళు చాలా మంచోళ్ళు, మేము తమిళనాడులో పరిశ్రమ ఉన్నప్పుడు అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఇలాంటి నిర్ణయాలు తప్పు. తమిళ్ వాళ్ళే ముందు ఒప్పుకోరు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్స్ కూడా ఒప్పుకోరు. సెల్వమణి ఇప్పుడు యాక్టివ్ గా లేడు, సినిమాలు తీయట్లేదు. ఆయన అంటే తమిళ పరిశ్రమ అంతా అన్నట్టు కాదు. అది జరగని పని. మన వాళ్ళు అక్కడి సినిమాల్లో చేస్తారు, వాళ్ళు ఇక్కడి సినిమాల్లో చేస్తారు. ఎవరో సెల్వమణి అన్నంత మాత్రాన జరిగిపోవు అని అన్నారు. దీంతో పోసాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.