Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ రాత్రి పదింటికి ఫోన్ చేసి తిట్టారు: పోసాని

ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక పోసాని ఫోన్ కి కొన్ని వేల మెసేజ్ లు పంపిస్తున్నారు.

Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ రాత్రి పదింటికి ఫోన్ చేసి తిట్టారు: పోసాని

Pavan Kalyan

Updated On : September 28, 2021 / 6:46 PM IST

Posani Krishna Murali :

పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన స్పీచ్ అటు పరిశ్రమలోనూ, ఇటు రాజకీయాల్లోనూ సంచలనం సృష్టిస్తుంది. దీనిపై వైసీపీ వాళ్లు జనసేన వాళ్ళు ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. దీనిపై పరిశ్రమలో కూడా విమర్శలు వస్తున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని అధికారికంగానే ప్రకటించింది. దీనిపై నిన్న పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని దారుణంగా విమర్శించారు.

ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాక పోసాని ఫోన్ కి కొన్ని వేల మెసేజ్ లు పంపిస్తున్నారు. అత్యంత దారుణంగా తిడుతూ పోసానికి మెసేజ్ లు ఫోన్లు వచ్చాయి. దీంతో ఇవాళ మళ్ళీ పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై విరుచుకు పడ్డారు.

ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ నన్ను రాత్రిపూట ఫోన్ చేసి మరీ తిట్టారని, నన్ను సినిమాలోంచి తీసేశారని తెలిపారు. నేను సినిమా షూటింగ్ కి టైంకి ఉంటానని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పని చేస్తానని ఇండస్ట్రీ అందరికి తెలుసు. అయినా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టైంలో రాత్రి టైం షూట్ ఉందని చెప్తే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో అని ఒప్పుకొని వెళ్ళాను. రాత్రి 7 నుంచి 9 వరకు షూట్ అని చెప్పారు నేను టైంకి వెళ్ళాను. కానీ పవన్ కళ్యాణ్ రాలేదు. 9 వరకు వెయిట్ చేసి చేసి కో డైరెక్టర్ కి చెప్పి మరీ వెళ్ళిపోయాను.

నేను వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ లొకేషన్ కి వచ్చి నేను లేనని తెలిసి నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా షూటింగ్ ఉందని చెప్పినా ఎలా వెళ్ళిపోతావు అని పిచ్చి తిట్లు తిట్టాడు. నేను ఏం జరిగిందో చెప్పాను. అవునా సారీ అని చెప్పి ఫోన్ కట్ చేసి నన్ను సినిమాలోంచి తీసేయమని డైరెక్టర్ కి చెప్పాడు. కో డైరెక్టర్ ని కూడా తీసేసారు. అలాంటి వాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి నా మీద కోపం ఉంది. అందుకే తన ఫ్యాన్స్ తో ఇలా బూతులు తిట్టిస్తున్నాడు. ఇలా ఫోన్స్ చూపిస్తున్నాడు అని విరుచుకుపడ్డారు పోసాని.