పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ హై ఓల్టేజ్‌ రోల్‌, పవన్ న్యూ ఫిల్మ్..వీడియో రిలీజ్

  • Published By: madhu ,Published On : October 25, 2020 / 12:17 PM IST
పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌ ఇన్‌ హై ఓల్టేజ్‌ రోల్‌, పవన్ న్యూ ఫిల్మ్..వీడియో రిలీజ్

Updated On : October 25, 2020 / 12:39 PM IST

Power Star Pawan Kalyan – Sithara Entertainments : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. అభిమానులను అలరించేందుకు ఇప్పటికే పలు సినిమాలకు ఆయన సైన్ చేశారు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ‘వకీల్ సాబ్ చిత్రం’లో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు..క్రిష్, హరీశ్ శంకర్ లతో సినిమాలు చేయనున్నారు.




తాజాగా..పవన్ మరో కొత్త ప్రాజెక్టు ఒకే చేశారు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. దసరా పండుగ సందర్భంగా..చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.




తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఈజ్ బ్యాక్ ఇన్ హై ఓల్టేజ్ రోల్ అని క్యాప్షన్ పెట్టింది. ఈ సినిమాకు తమన్ సర్వాలు అందించనున్నారు. ఈ సినిమాలో పవన్ పోలీస్ పాత్ర పోషించనున్నారా ? ఇతరత్రా విషయాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.




ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత..సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం..ఒక్కో సినిమాకు సైన్ చేస్తూ..వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వకీల్ సాబ్ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయినట్లు సమాచారం.




కరోనా కారణంగా..షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను 2020, అక్టోబర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.