Narappa Trailer: పవర్‌ఫుల్‌ ట్రైలర్.. చాలాకాలం తర్వాత వెంకీ ఉగ్రరూపం!

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకడైన వెంకటేష్ ఒకవైపు యువహీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే తనకు తగిన కథలతో సోలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఏ సీనియర్ హీరోలకు లేనంతగా వెంకీ ఇప్పుడు రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే వెంకీ ప్రస్తుతం నారప్పగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Narappa Trailer: పవర్‌ఫుల్‌ ట్రైలర్.. చాలాకాలం తర్వాత వెంకీ ఉగ్రరూపం!

Narappa Trailer

Updated On : July 14, 2021 / 3:35 PM IST

Narappa Trailer: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకడైన వెంకటేష్ ఒకవైపు యువహీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూనే తనకు తగిన కథలతో సోలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఏ సీనియర్ హీరోలకు లేనంతగా వెంకీ ఇప్పుడు రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే వెంకీ ప్రస్తుతం నారప్పగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో వెంకటేష్ చాలా కాలం తర్వాత ఉగ్రరూపం చూపించారు.

అప్పుడెప్పుడో లక్ష్మీ, తులసీ సినిమాలలో వెంకీ కత్తిపట్టి నరకడం చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు మళ్ళీ నారప్పలో వెంకీ కత్తిపట్టిన తీరు చూసి నో డౌట్ చాలాకాలం తర్వాత ఇది వెంకీ ఉగ్రరూపమే అని ఫిక్స్ అయిపోయారు. ఒకవిధంగా ట్రైలర్లో చూపించిన సన్నివేశాలు సినిమాపై హైప్ పెంచేశాయి. నారప్పగా వెంకటేశ్‌ అదరగొట్టేశాడు. ఇక డైలాగ్స్ కూడా సినిమా కథనాన్ని తెలిపేలా ఉన్నాయి. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు.. కానీ చదువు ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకటేశ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది.

ఇక ట్రైలర్ లో మణిశర్మ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బమ్స్ తెప్పిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత విక్టరీ వెంకటేష్-శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తున్న సినిమా నారప్ప కాగా తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’కు ఇది రీమేక్‌. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్ లిమిటెట్, వీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో వెంకటేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే.