Illu Illalu Pillalu : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అంటున్న ఆమని, ప్రభాకర్..
తాజాగా మరో కొత్త సీరియల్ మొదలు కాబోతుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే పేరుతో ఈ సీరియల్ రానుంది.

Prabhaskar Aamani Illu Illalu Pillalu New Serial coming Soon Details Here
Illu Illalu Pillalu : ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ను అందిస్తుంది స్టార్ మా ఛానల్. తాజాగా మరో కొత్త సీరియల్ మొదలు కాబోతుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే పేరుతో ఈ సీరియల్ రానుంది. సీనియర్ నటుడు ప్రభాకర్, ఒకప్పటి హీరోయిన్ ఆమని జంటగా ఈ సీరియల్ తెరకెక్కుతుంది. ఈ సీరియల్ ని ప్రభాకర్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రోమోలు కూడా రిలీజ్ చేసారు.
ఈ సీరియల్ ప్రోమోలు చూస్తుంటే.. రెండు కుటుంబాల మధ్య ప్రేమ పెళ్లి వల్ల ఎన్ని గొడవలు వచ్చాయి, ఆ కుటుంబాల మధ్య ఎంత దూరం పెరిగింది, ఓ కుటుంబంలో ఉండే ఆప్యాయతలు, హీరో పాత్ర తను పడిన బాధ తన పిల్లలు పడకూడదు అని ఎవర్ని ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవద్దని మాట ఇమ్మనడం, మరి ఆ పిల్లలు ప్రేమించకుండా ఉంటారా? అనే పాయింట్స్ తో ఈ సీరియల్ అనుబంధాలు, ఆప్యాయతలు, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతోందని తెలుస్తుంది.
Also Read : Allu Arjun Mother : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ తల్లి కూడా.. బన్నీ గురించి ఏం చెప్పింది..?
‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ స్టార్ మా ఛానల్ లో నవంబర్ 12 నుంచి రాత్రి 7.30 ని.లకు ఈ సీరియల్ ప్రారంభం కానుంది. ప్రారంభం కానుంది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు ఈ సీరియల్ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఒకప్పుడు హీరోయిన్ గా పలు హిట్స్ అందుకున్న ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో, సీరియల్స్ తో బిజీగా ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో మెప్పించనుంది. మీరు కూడా ఈ సీరియల్ ప్రోమోలు చూసేయండి..