Prabhas : అప్పులు ఉన్నాయని ఆ సినిమా చేశా.. బాహుబలి ఒప్పుకున్నాక కూడా వేరే సినిమాలు చేశా..

బాహుబలి, దానికి ముందు సినిమాల గురించి ప్రభాస్ మాట్లాడాడు. అప్పులు ఉన్నాయని రెబెల్ సినిమా చేశాను. ఆ తర్వాత నాకు ఓ నిర్మాణ సంస్థ ఉండాలని అనిపించింది. వంశీ ఓకే అన్నాడు, ప్రమోద్ కూడా ఓకే చెప్పడంతో UV నిర్మాణసంస్థని..........

Prabhas : అప్పులు ఉన్నాయని ఆ సినిమా చేశా.. బాహుబలి ఒప్పుకున్నాక కూడా వేరే సినిమాలు చేశా..

Prabhas about rebel and mirchi movies

Updated On : December 30, 2022 / 12:31 PM IST

Prabhas :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరు ఎపిసోడ్స్ ఇప్పటికే పూర్తికాగా ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.

ప్రభాస్ అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ప్రభాస్ సినిమాలు, పెళ్లి.. ఇలా అనేక టాపిక్స్ ప్రస్తావించాడు బాలయ్య. బాహుబలి, దానికి ముందు సినిమాల గురించి ప్రభాస్ మాట్లాడాడు. అప్పులు ఉన్నాయని రెబెల్ సినిమా చేశాను. ఆ తర్వాత నాకు ఓ నిర్మాణ సంస్థ ఉండాలని అనిపించింది. వంశీ ఓకే అన్నాడు, ప్రమోద్ కూడా ఓకే చెప్పడంతో UV నిర్మాణసంస్థని స్థాపించాం. వంశీ కొరటాల శివతో మాట్లాడి కథని సెట్ చేశాడు. దీంతో మిర్చి సినిమా తీశాం.

Prabhas : రాజమౌళి వల్ల అందరి డైరెక్టర్స్ నన్ను తిడతారు.. విశ్వనాథ్ గారు కూడా తిట్టారు..

అయితే మిస్టర్ పర్ఫెక్ట్ అయ్యాక బాహుబలి ఒప్పుకున్నాను. రాజమౌళి గురించి తెలిసిందేగా లేట్ అవుతుంది అనడంతో ఈ గ్యాప్ లో రెబెల్ సినిమా చేశాను. బాహుబలి షూట్ మొదలుపెడతాం అన్నప్పుడు మిర్చి తీద్దాం అన్నారు. రాజమౌళిని అప్పటికే పర్మిషన్ తీసుకొని రెబెల్ చేశాను, మళ్ళీ మిర్చికి ఓకే అంటాడా లేదో అని అడిగితే రమా గారు ఆయనకి ఎలాగో లేట్ అవుద్ది నువ్వెళ్ళి మిర్చి సినిమా చేసి వచ్చేయ్ అన్నారు. దీంతో బాహుబలి ఒప్పుకున్నాక రెబెల్, మిర్చి సినిమాలు చేశాను అని తెలిపాడు.