Prabhas : మారుతీ సినిమా స్టోరీ లైన్ ఏంటో చెప్పిన ప్రభాస్..
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సలార్ పార్ట్ 2, మారుతీ సినిమా స్టోరీ లైన్ గురించి మాట్లాడారు.

Prabhas comments about Salaar Part 2 and Maruthi Movie story line
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘సలార్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం థియేటర్స్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని కాసుల వర్షం కురిపిస్తుంది. కాగా ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో.. ఆడియన్స్ అంతా సెకండ్ పార్ట్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సెకండ్ పార్ట్ అండ్ తన లైనప్స్ గురించి ప్రభాస్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రముఖ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సలార్ పార్ట్ 2 గురించి మాట్లాడుతూ.. “స్టోరీ ఆల్రెడీ సిద్ధంగా ఉందని, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా థియేటర్స్ లోకి తీసుకు వచ్చేలా పని చేస్తామంటూ” ప్రభాస్ పేర్కొన్నారు. ఇక తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. “నాకున్న ఏకైక ‘గోల్’ నా పనితో ప్రతిఒకర్ని ఎంటర్టైన్ చేయడం. నేను ఓ సినిమాకి ఓకే చెప్పడం వెనుక మొదటి కారణం అదే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Salaar Collections : నైజంలో సలార్ రికార్డు.. వరల్డ్ వైడ్‌గా రెండు వారాల కలెక్షన్స్ ఎంతంటే..
ప్రస్తుతం సలార్ 2తో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకటి ఫ్యూచరిస్టిక్ సినిమా అంటూ ‘కల్కి’ గురించి మాట్లాడారు. అలాగే మారుతీ సినిమా గురించి మాట్లాడుతూ.. అది హారర్ మూవీ అని తెలియజేసారు. ఈ సినిమా హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతోందని ఇప్పటివరకు ఎటువంటి ఉహాగాన వార్తలే వచ్చాయి. తాజాగా ఇప్పుడు ప్రభాస్ చేసిన కామెంట్స్ ఆ వార్తల్ని అధికారికంగా కన్ఫార్మ్ చేసినట్లు అయ్యింది.
కాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇదే టైటిల్ ని మూవీ టీం అనౌన్స్ చేస్తుందా లేదా మరో టైటిల్ ని ప్రకటిస్తుందా అనేది చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారట.