Prabhas : మరోసారి ప్రభాస్ మంచి మనసు.. వాళ్ళ కోసం 35 లక్షలు డొనేట్ చేసిన ప్రభాస్..

ప్రభాస్ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. డొనేషన్స్ కూడా ఇచ్చారు గతంలో.

Prabhas : మరోసారి ప్రభాస్ మంచి మనసు.. వాళ్ళ కోసం 35 లక్షలు డొనేట్ చేసిన ప్రభాస్..

Prabhas Donated 35 Laksh to Telugu Film Directors Association Director Maruthi Announced

Updated On : April 23, 2024 / 9:39 AM IST

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ సినిమాలు చేస్తూ పాన ఇండియా లెవల్లో సక్సెస్ లు కొడుతున్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే. షూటింగ్ లో, లేదా తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తాడు. ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉంటారు. ఇక ప్రభాస్ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. డొనేషన్స్ కూడా ఇచ్చారు గతంలో.

తాజాగా ప్రభాస్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్(Telugu Film Directors Association) కి డొనేషన్ ఇచ్చారు. త్వరలో మే 4న దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు. స్టేడియంలో భారీ జనల మధ్య టాలీవుడ్ లోని ప్రముఖులు అంతా హాజరవ్వగా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కార్యక్రమం నిన్న రాత్రి జరగ్గా ఈ కార్యక్రమానికి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు.

Also Read : Allari Naresh : రచయితగా అల్లరి నరేష్.. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తనే రాసుకుంటున్నాడట..

ఈ కార్యరామంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. మన డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రభాస్ గారు 35 లక్షలు ప్రకటించారు. ఇందాకే కాల్ చేసి ప్రభాస్ గారు మాట్లాడి 35 లక్షలు ఇస్తానని చెప్పినట్టు తెలిపారు. దీంతో ప్రభాస్ పై దర్శకుల సంఘం అభినందనలు కురిపించారు. ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు మరోసారి ప్రభాస్ మంచి మనసుని అభినందిస్తున్నారు. ఇటీవల దర్శకుల సంఘంకి నిర్మాత SKN కూడా 10 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రాజా సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.