Prabhas: రాధేశ్యామ్ నిరాశలో ఫ్యాన్స్.. జోష్ నింపే అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్!

తేడాకొట్టిన రాధేశ్యామ్ రిజల్ట్ పక్కకుపెట్టి.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచారు గ్లోబల్ స్టార్. ఆయన సైలెన్స్ పాటిస్తున్నా.. రాబోయే సినిమాల మేకర్స్ మాత్రం ఫ్యాన్స్ లో సూపర్..

Prabhas: రాధేశ్యామ్ నిరాశలో ఫ్యాన్స్.. జోష్ నింపే అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్!

Prabhas

Updated On : March 26, 2022 / 7:03 PM IST

Prabhas: తేడాకొట్టిన రాధేశ్యామ్ రిజల్ట్ పక్కకుపెట్టి.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచారు గ్లోబల్ స్టార్. ఆయన సైలెన్స్ పాటిస్తున్నా.. రాబోయే సినిమాల మేకర్స్ మాత్రం ఫ్యాన్స్ లో సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రభాస్ సీక్వెల్స్ పై వెంటవెంటనే క్రేజీ అప్ డేట్స్ చెప్పేస్తున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం డార్లింగ్ అభిమానుల్ని ఆలోచనలో పడేసింది. ఆ డిటేల్స్ పై ఓ లుక్.

Prabhas: సలార్.. ఈ ఏడాది లేనట్టే!

రాధేశ్యామ్ నిరాశపెట్టినా.. ఇక తగ్గేదే లే అన్నట్టు రెడీఅవుతున్నారు ప్రభాస్. తన లిస్ట్ లో ఉన్న నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్సట్రేషన్ పెంచేస్తున్నారు. డార్లింగ్ తో సినిమాలు చేస్తోన్న మేకర్స్ ఇప్పుడు కొత్త అప్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. సలార్ సినిమాకు సంబంధించి హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ స్పెషల్ న్యూస్ రివీల్ చేశారు. అయితే అది కాస్త ఫ్యాన్స్ ను కాస్త ఇబ్బందిపెట్టింది. సలార్ వచ్చేది ఈ ఏడాది కాదని.. 2023 ఏప్రిల్, జూన్ మధ్య రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నాడు విజయ్.

Prabhas : ప్రభాస్‌కి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్..

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సలార్ ఇప్పటి వరకు జరుపుకున్న షూటింగ్ 30 శాతం మాత్రమే. ఇంకా 70 శాతం బ్యాలెన్స్ ఉంది. గ్లోబల్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించిన ఈ ఫిల్మ్ రష్.. ప్రభాస్ కు బాగా నచ్చిందన్నారు ప్రొడ్యూసర్. రాధేశ్యామ్ కారణంగా ప్రభాస్, కేజీఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్న కారణంగా ఆగిన సలార్ షూటింగ్ ఈ మే నుంచి మళ్లీ రీస్టార్ట్ కాబోతుంది. ఈ ఇయర్ ఎండ్ లోగా షెడ్యూల్స్ పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ లోపు తీసుకురావాలనేది ప్లాన్. అయితే మంచి టైం చూసుకుని సలార్ రెండు భాగాల విషయం ఫ్యాన్స్ తో షేర్ చేస్తామని హింట్ ఇచ్చారు హోంబలే ప్రొడ్యూసర్.

Prabhas: రాధేశ్యామ్ ఎఫెక్ట్.. పాతిక తగ్గించేసిన ప్రభాస్?

సలార్ సంగతలా ఉంటే ఆదిపురుష్ కి సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతోందిప్పుడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేశారు ప్రభాస్. అయితే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో ఫుల్ గా స్యాటిస్ ఫై అవుతోన్న ఓంరౌత్.. ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించేలా ప్రయత్నాలు షురూ చేశారు. ఆదిపురుష్ సీక్వెల్ లైన్ విన్నప్రభాస్.. పూర్తి స్టోరీ వినాల్సి ఉంది. అంతా ఓకే అయితేనే ఈ మూవీ సీక్వెల్ పట్టాలెక్కుతోంది. ఆదిపురుష్ మాత్రం వచ్చే సంవత్సరం జనవరి 12 సంక్రాంతి కానుకగా రాబోతుంది. అయితే అంతా బాగుంది కానీ గ్లోబల్ స్టార్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్స్ సలార్, ఆదిపురుష్ కోసం ఫ్యాన్స్ మాత్రం 2023 వరకు ఆగాల్సిందే.