Prabhas: రాధేశ్యామ్ ఎఫెక్ట్.. పాతిక తగ్గించేసిన ప్రభాస్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించాడు. ఆ సినిమా తరువాత ‘బాహుబలి 2’తోనూ తన మేనియాను ప్రపంచవ్యాప్తంగా.....

Prabhas: రాధేశ్యామ్ ఎఫెక్ట్.. పాతిక తగ్గించేసిన ప్రభాస్?

Prabhas Remuneration For Maruthi Movie Goes Viral

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించాడు. ఆ సినిమా తరువాత ‘బాహుబలి 2’తోనూ తన మేనియాను ప్రపంచవ్యాప్తంగా కొనసాగించాడు ఈ హీరో. ఇక తనకు ఎదురే లేదంటూ దూసుకుపోతున్న ప్రభాస్ తన రెమ్యునరేషన్‌ను కూడా అమాంతం పెంచేశాడు. ఈ క్రమంలో బాహుబలి తరువాత తన ప్రతి సినిమాకు వంద కోట్లకు తగ్గకుండా ప్రభాస్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తూ వస్తున్నాడు. ఇక రీసెంట్‌గా రాధేశ్యామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ స్టార్ హీరో. తన కెరీర్‌లో ఓ సరికొత్త చిత్రంగా రాధేశ్యామ్ మిగులుతుందని ప్రభాస్ ఆశించాడు. అందుకు తగ్గట్టుగానే సినిమా రిలీజ్‌కు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొన్నాడు.

Prabhas: రాధేశ్యామ్‌కు భారీ కలెక్షన్లు.. బాహుబలి క్రేజే కారణమా?

అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం పక్కనబెడితే, కనీసం హిట్ టాక్ కూడా తెచ్చుకోలేదు. దీంతో ఈ సినిమా ఇప్పుడు భారీ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. ముఖ్యంగా నార్త్‌లో ప్రభాస్ క్రియేట్ చేసుకున్న ఫాలోయింగ్ మొత్తం ఈ సినిమాతో పోయిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు తిరిగి అక్కడ తన సత్తా చాటాలంటే వెంటనే ఓ భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆయన చూస్తున్నాడు. కానీ అది ఇప్పట్లో జరిగేటట్లు మాత్రం కనిపించడం లేదు. ఇక ఈ సంగతి పక్కనబెడితే.. రాధేశ్యామ్ చిత్రం ప్రభాస్‌పై కూడా గట్టి ప్రభావమే చూపించింది. ప్రతి సినిమాకు వంద కోట్లకు తగ్గకుండా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం ఏకంగా పాతిక కోట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు కాకుండా, దర్శకుడు మారుతి డైరెక్షన్ ప్రభాస్ ఓ సినిమా చేసి వెంటనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతకొద్ది రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయి. అయితే మారుతి ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ హార్రర్ కామెడీ సినిమా వస్తుందనే వార్త కూడా ఇందులో ఒకటి. కానీ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం మేరకు ప్రభాస్ కోసం మారుతి ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Prabhas: రాధేశ్యామ్ టు రాజా డీలక్స్.. తూచ్.. అంటోన్న ప్రభాస్!

ఇక ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అంటే ఏకంగా పాతిక కోట్ల మేర రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ సినిమా చేస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇంత భారీగా రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకున్నాడా అని వారు ప్రశ్నిస్తున్నారు. రెమ్యునరేషన్ తగ్గినా పర్లేదు కానీ.. తనకు ఈసారి ఖచ్చితంగా హిట్ పడితీరాలని ప్రభాస్ భావిస్తున్నాడు. మరి నిజంగానే మారుతి తీసుకొచ్చే కథ ప్రభాస్‌కు విజయాన్ని అందిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను డివివి.దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండగా ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.