Prabhas: రాధేశ్యామ్‌కు భారీ కలెక్షన్లు.. బాహుబలి క్రేజే కారణమా?

ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే.. ఆడియన్స్ కి కూడా బోరే. ఎంత డై హార్డ్ ఫ్యాన్స్ అయినా రొటీన్ ఫీల్ అవుతారు. అందుకే ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ కి ఎప్పటి కప్పుడు ఫ్రెష్ నెస్ ఇవ్వడానికి ట్రై..

Prabhas: రాధేశ్యామ్‌కు భారీ కలెక్షన్లు.. బాహుబలి క్రేజే కారణమా?

Prabhas

Prabhas: ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే.. ఆడియన్స్ కి కూడా బోరే. ఎంత డై హార్డ్ ఫ్యాన్స్ అయినా రొటీన్ ఫీల్ అవుతారు. అందుకే ప్రభాస్ మాత్రం తన ఫ్యాన్స్ కి ఎప్పటి కప్పుడు ఫ్రెష్ నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. తను చూజ్ చేసుకున్న ఫార్ములా మంచిదే కాని, బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ ఎంపిక చేసుకుంటున్న స్టోరీస్ పరిస్తితేంటి? ఈ సినిమాలతో ప్రభాస్ కు వస్తోన్న మైలేజ్ ఎంత? ప్రభాస్ లేటెస్ట్ మూవీస్ తో ఫాన్స్ సాటిసైఫై అవుతున్నారా? డిటైల్డ్ స్టోరీలో చూద్దాం.

Prabhas: డార్లింగ్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ అయ్యేనా?

కెరీర్ స్టార్టింగ్ నుంచి కమర్షియల్ హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు ప్రభాస్. సినిమా సినిమాకి క్యారెక్టర్ వైజ్ వేరియేషన్, ఇంప్రూవైజేషన్ చూపిస్తున్నాడు డార్లింగ్. బాహుబలి సిరీస్ తర్వాత సాహో, రాధేశ్యామ్ లోనూ తను డిఫరెంట్ క్యారెక్టర్స్ నే చూజ్ చేసుకున్నాడు. అయినా, బాహుబలితో అమాంతం పెరిగిన క్రేజ్ ను సస్టెయిన్ చేయడానికే పరిమితమవుతుండటంతో.. సాహో, రాధేశ్యామ్ సినిమాల రిజల్ట్ తో గ్లోబల్ స్టార్ కూడా ఎంతో కొంత నేర్చుకోవాలని చర్చించుకుంటున్నారు ఆయన ఫాన్స్.

Prabhas: ట్రెండ్ సెట్టర్ ప్రభాస్.. జీ హుజూర్ అంటున్న రికార్డులు!

ప్రస్తుతం రిలీజ్ అయిన రాధేశ్యామ్ లో హార్డ్ కోర్ లవర్ బాయ్ గా కనిపించిన ప్రభాస్ పామిస్ట్ క్యారెక్టర్ లో మెప్పించినా స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను అంతగా సాటిస్ఫై చేయలేకపోయారు. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్నీ భాషల్లోనూ సేమ్ రిజల్ట్ చూడాల్సి వస్తోంది. బాహుబలితో ప్రభాస్ కొచ్చిన భారీ క్రేజ్ వసూళ్లకు రీజనవుతుంది కాని, సినిమా పరంగా డివైడ్ టాక్ తో నే రన్ అవుతోంది.

Prabhas: రెబల్ స్టార్ ఇక్కడ.. హిట్టు-ఫట్టు లెక్కేలేదు!

సాహో విషయానికొస్తే నార్త్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగానే కనెక్ట్ అయినా.. తెలుగు ఆడియన్స్ కు ఎక్కలేదు. అయినా భారీ కలెక్షన్స్ తీసుకొచ్చి ప్రభాస్ స్టామినాను ప్రూవ్ చేసింది. సాహో తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా, యూనిక్ లవ్ స్టోరీ తో వస్తున్నాడని రాధేశ్యామ్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫాన్స్. భారీ స్తాయి ప్రమోషన్స్ చేసి, మేకర్స్ కూడా ఈ సినిమాపైన ఎక్స్ పెక్టేషన్స్ భారీగా పెంచేశారు. అంచనాలకు మించి ఉంటుందని ఊహించుకున్న సినిమా కాస్తా.. ఆ లెవల్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది. అందుకే ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే ఆదిపురుష్, సలార్, స్పిరిట్ సినిమాల గురించి చర్చించుకుంటున్నారు ఫాన్స్.

Prabhas: చిన్నవాటిపై కన్నేసిన ప్రభాస్..!

సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ మూవీలో పోలీస్ గా కనిపించబోతున్నారు ప్రభాస్. సలార్ లో స్ట్రాంగ్ మాస్ నేటివిటీ ఉన్న రా క్యారెక్టర్ చేస్తున్న ప్రభాస్.. ఓమ్ రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా నెవర్ బిఫోర్ లుక్ తో సర్ ప్రైజ్ చెయ్యబోతున్నారు. నాగాశ్విన్ తో తెరకెక్కుతున్న సైఫై డ్రామా మూవీ ప్రాజెక్ట్ కెలో మరో కొత్త గెటప్ లో కనిపించబోతున్నారు ప్రభాస్. ఇలా ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా తన క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్న గ్లోబల్ స్టార్.. స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ విషయంలోనూ కాస్త కేర్ తీసుకుంటే గ్లోబల్ స్టార్ ఇమేజ్ రెట్టింపవుతుందని ఆయన ఫాన్స్ ఫీలవుతున్నారు.