Prabhas: రెబల్ స్టార్ ఇక్కడ.. హిట్టు-ఫట్టు లెక్కేలేదు!

ప్రభాస్ ఎక్కడున్నా బాసే. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తెచ్చినా, టాలీవుడ్ కి 2 వేల కోట్ల కలెక్షన్ల మూవీ అందించినా.. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు..

Prabhas: రెబల్ స్టార్ ఇక్కడ.. హిట్టు-ఫట్టు లెక్కేలేదు!

Prabhas

Prabhas: ప్రభాస్ ఎక్కడున్నా బాసే. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్ కి తెచ్చినా, టాలీవుడ్ కి 2 వేల కోట్ల కలెక్షన్ల మూవీ అందించినా.. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా.. సినిమా హిట్ అయినా కాకపోయినా సేమ్ ఇమేజ్ ని క్యారీ చేయాలన్నా.. బాలీవుడ్ డైరెక్టర్లని తన క్రేజ్ తో కట్టిపడెయ్యాలన్నా.. ఒక్క ప్రభాస్ కే సాధ్యం. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా తనకంటూ సెపరేట్ ఫాన్ బేస్ ని, బాక్సాఫీస్ రికార్డ్స్ ని సొంతం చేసుకుంటున్నారు ప్రభాస్.

Prabhas: చిన్నవాటిపై కన్నేసిన ప్రభాస్..!

ఒక్క సినిమా కోసం 5 ఏళ్లు వెయిట్ చేసినా, ఒకే సంవత్సరంలో 5 సినిమాలు అనౌన్స్ చేసినా.. ప్రభాస్ కే సాధ్యం. ఒక్క సినిమాతో వందల కోట్ల కలెక్షన్లతో ఓవర్ నైట్ బాలీవుడ్ ని కూడా వెంటపడేలా చేసుకోవడం ప్రభాస్ కేసాధ్యం. ఇంత పెద్ద స్టార్ డమ్ ని అంతే ఈజ్ తో క్యారీ చేస్తూ.. వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్.. రాధేశ్యామ్ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన భారీ లవ్ స్టోరీ మార్చి 11న రిలీజ్ అయ్యింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డ్ థియేటర్లలో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర హడావిడి చేస్తోంది.

Prabhas : రాజమౌళికి నాకంటే చరణ్, తారక్‌లే ఎక్కువ

బెన్ ఫిట్ షోల దగ్గరనుంచే బాక్సాఫీస్ స్టామినాని ప్రూవ్ చేసుకుంటోంది ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ. మూడేళ్ల నుంచి తెరకెక్కిన రాధేశ్యామ్.. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకొస్తుందా అని ఎదురుచశారు అందరూ. ఫైనల్లీ ఆరోజు రానే వచ్చింది. లాస్ట్ మూడు సినిమాలు.. యాక్షన్ సినిమాలు కావడంతో.. ఈ సారి ట్రాక్ మార్చి లవర్ బాయ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు ప్రభాస్. పూజాహెగ్డేతో రొమాన్స్ పండిస్తూనే.. మాస్ ఆడియన్స్ కోసం గ్రాండ్ సీన్స్ ని సినిమాలో యాడ్ చేశారు టీమ్.

Prabhas: రెబల్ స్టార్ యాక్షన్.. ఢీకొట్టే పవర్ఫుల్ విలన్స్ వీళ్ళే

హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ ని అదే రేంజ్ లో ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. మిర్చి నుంచి కమర్షియల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. అప్పటి నుంచి తన కమర్షియల్ స్టామినాని బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. లేటస్ట్ గా రిలీజ్ అయిన రాధేశ్యామ్ కూడా ఫస్ట్ డే కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారుటీమ్. 300 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కిన రాధేశ్యామ్.. కలెక్షన్లలో మరో మెట్టు ఎక్కుతుందని ఫుల్ ఖుష్ అవుతుందంటున్నారు ఫాన్స్.