Prabhas: చిన్నవాటిపై కన్నేసిన ప్రభాస్..!

‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు.

Prabhas: చిన్నవాటిపై కన్నేసిన ప్రభాస్..!

Prabhas Eyes On Small Movies

Prabhas: ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు. కానీ వసూళ్ల పరంగా మాత్రం ఈ మూవీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ డార్లింగ్ యమ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆడియెన్స్‌తో పంచుకున్నాడు.

Radheshyam : అమెరికాలో ‘రాధేశ్యామ్’ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్.. వరుసగా నాలుగో సినిమాతో ప్రభాస్ రికార్డు

గతకొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూనే.. మధ్యలో చిన్న సినిమాలు కూడా చేయాలని ఆలోచిస్తున్నాడట ఈ స్టార్ హీరో. అవును.. ప్రభాస్ ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా చేయాలని, దానికి తగ్గ ప్రణాళిక కూడా వేస్తున్నాడట. ఈ క్రమంలోనే పలువురు దర్శకులను ఆయన కలిసి వారు చెప్పే కథలు కూడా వింటున్నాడట. చిన్న బడ్జెట్ చిత్రాలు చేయడంతో ఆడియెన్స్‌కు మరింత దగ్గరవుతానని డార్లింగ్ భావిస్తున్నాడట. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ ఆయనకు కొన్ని స్టోరీలైన్స్ వినిపించారని చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా వీరిలో చిన్న సినిమాలను భారీ సక్సెస్‌లుగా మలిచే స్పెషలిస్ట్ డైరెక్టర్ మారుతి కూడా ఉన్నారట. ఆయన ప్రభాస్‌కు ఓ అదిరిపోయే స్టోరీలైన్‌ను వినిపించాడట. దానికి ఇంప్రెస్ అయిన ప్రభాస్, వెంటనే ఈ కథను పూర్తిగా డెవలప్ చేయాల్సిందిగా కోరాడట. ఈ లెక్కన త్వరలోనే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే సినిమాను మనం చూడబోతున్నామని సినిమా వర్గాల్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Radhe Shyam: ప్రభాస్ లుక్స్‌పై ఫ్యాన్స్ కామెంట్స్!

అయితే చిన్న సినిమాల్లో కూడా కంటెంట్ బలంగా ఉంటేనే తాను సదరు సినిమాలు చేసేందుకు రెడీ అంటూ మెలికపెట్టాడు ఈ బాహుబలి యాక్టర్. మరి డార్లింగ్ కోసం డైరెక్టర్ మారుతి ఎలాంటి కథను రెడీ చేస్తాడా.. ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా.. అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ చిన్న సినిమాలను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలనే కండీషన్ కూడా పెడుతున్నాడట మన హీరో. మరి ప్రభాస్ నిజంగానే చిన్న సినిమాలను తాను అనుకున్న విధంగా తక్కువ సమయంలో, స్ట్రాంగ్ కంటెంట్‌తో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోగలడా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.