Radheshyam : అమెరికాలో ‘రాధేశ్యామ్’ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్.. వరుసగా నాలుగో సినిమాతో ప్రభాస్ రికార్డు

అమెరికాలో తెలుగు సినిమాలకి చాలా క్రేజ్ ఎక్కువ. అక్కడ కూడా మన తెలుగు సినిమాలు మంచి కలెక్షన్స్ ని సాధిస్తాయి. అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు...

Radheshyam : అమెరికాలో ‘రాధేశ్యామ్’ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్.. వరుసగా నాలుగో సినిమాతో ప్రభాస్ రికార్డు

Radheshyam

Radheshyam :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా ‘రాధేశ్యామ్’ సినిమా నిన్న మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమాపై రిలీజ్ కి ముందే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. కొన్ని చోట్ల డివైడ్ టాక్ వినిపించినా ప్రభాస్ తన స్టామినాతో, రాధేశ్యామ్ విజువల్స్ తో సినిమాకి మరింత రీచ్ పెరిగింది. దీంతో కలెక్షన్స్ కూడా మొదటి రోజు అదరగొట్టాయి.

ఇక తెలుగు సినిమాలకి దేశం బయట హైయెస్ట్ మార్కెట్ ఉంది అమెరికాలోనే. అమెరికాలో తెలుగు సినిమాలకి చాలా క్రేజ్ ఎక్కువ. అక్కడ కూడా మన తెలుగు సినిమాలు మంచి కలెక్షన్స్ ని సాధిస్తాయి. అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అమెరికాలో 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో ‘రాధేశ్యామ్’ మొదటి రోజే చేరింది. రాధేశ్యామ్ కి ప్రీమియర్స్‌తో పాటు మొదటిరోజు కలెక్షన్స్‌ కలిపి 1 మిలియన్ డాలర్స్‌ వచ్చాయి. మొదటి రోజే 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రావడం అంటే భారీగానే కలెక్షన్స్ వచ్చి విజయం సాధించినట్లే. ఇది ఇలాగే కొనసాగితే ఈ వీకెండ్ లో రెండు మిలియన్ డాలర్లని ఈజీగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

Sreemukhi : ‘జాతిరత్నాలు’తో శ్రీముఖి రీఎంట్రీ

ఇక ‘రాధేశ్యామ్’తో అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించిన ప్రభాస్ మరో కొత్త రికార్డు సృష్టించాడు. అమెరికాలో వరుసగా నాలుగు సినిమాలు 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. బాహుబలి1, బాహుబలి2, సాహో, రాధేశ్యామ్.. ఇలా వరుసగా నాలుగు సినిమాలతో ప్రభాస్ ఈ 1 మిలియన్ రికార్డు ని సాధించాడు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ తన సినిమాలతో కలెక్షన్ల సునామి కురిపిస్తున్నాడు.