Prabhas: ట్రెండ్ సెట్టర్ ప్రభాస్.. జీ హుజూర్ అంటున్న రికార్డులు!

హిట్, ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ ప్రభాస్ సొంతం. అందుకే అసలు సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ప్రభాస్ ఫాన్ బేస్ లో ఏమాత్రం తేడా ఉండదు. ప్రభాస్ అంటే ఫాన్స్ కి ఓ వైబ్రేషన్.

Prabhas: ట్రెండ్ సెట్టర్ ప్రభాస్.. జీ హుజూర్ అంటున్న రికార్డులు!

Prabhas

Prabhas: హిట్, ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ ప్రభాస్ సొంతం. అందుకే అసలు సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ప్రభాస్ ఫాన్ బేస్ లో ఏమాత్రం తేడా ఉండదు. ప్రభాస్ అంటే ఫాన్స్ కి ఓ వైబ్రేషన్. అందుకే ప్రభాస్ సినిమా రిజల్ట్ ఏదైనా కలెక్షన్లు, రికార్డులు ఈ స్టార్ హీరోకి జీహుజూర్ అనాల్సిందే. టాలీవుడ్‌లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ప్రభాస్‌ క్రేజీ హీరో. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాకు హీరో. ప్రభాస్‌ కెరీర్‌ మొత్తం మీద బ‍్లాక్‌ బస్టర్‌ హిట్ అనిపించుకునే సినిమాలు నాలుగైదు కూడా లేవు.

Prabhas: రెబల్ స్టార్ ఇక్కడ.. హిట్టు-ఫట్టు లెక్కేలేదు!

అయినా ప్రభాస్‌ రేంజ్‌ మాత్రం వరుసగా పది సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన హీరో స్థాయిలో ఉంది. ప్రభాస్‌ కమర్షియల్ స్టామినా కూడా ఈ జనరేషన్‌ హీరోలకు చుక్కలు చూపిస్తుంది. టాలీవుడ్ హీరోలకే కాదు బాలీవుడ్ హీరోలను కూడా కలెక్షన్లతో సవాల్‌ చేస్తున్నారు ప్రభాస్. ప్రభాస్‌ను ఎవరెస్ట్ స్థాయికి చేర్చిన సినిమా మాత్రం బాహుబలి అనే చెప్పాలి. అప్పటికి ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలు కలిపి దాదాపు 2500 కోట్ల వరకు వసూళ్లు సాధించాయి. బాలీవుడ్ లో కూడా ఇండియన్‌ బాక్సాఫీస్ ముందు ప్రభాస్‌ మార్కెట్‌ను బీట్ చేసే హీరో ఇంత వరకురాలేదు.

Prabhas: చిన్నవాటిపై కన్నేసిన ప్రభాస్..!

బాహుబలి ఫస్ట్ పార్ట్ 180 కోట్లతో తెరకెక్కి హిందీలోనే 120 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం కలిపి 650 కోట్లు కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి సెకండ్ పార్ట్.. ఇంకా గ్రాండియర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో అంతకుమించి నెక్ట్స్ లెవల్ లో 250 కోట్ల బడ్జెట్ తో సెకండ్ పార్ట్ ని షూట్ చేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. బాహుబలి ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే కలెక్షన్లతో అంతకుమించిన క్రేజ్ తో దుమ్ములేపింది.

Prabhas: రెబల్ స్టార్ యాక్షన్.. ఢీకొట్టే పవర్ఫుల్ విలన్స్ వీళ్ళే

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ చేసిన సాహో కూడా టాలీవుడ్ సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసింది. సాహో సినిమా మల్టీ లింగ్వల్ గా తెరకెక్కి.. 4500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. 300 కోట్ల బడ్జెట్ తో.. ప్రభాస్ కెరీర్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. యాక్షన్ ప్యాక్డ్ సినిమా అయిన సాహోలో ఏకంగా 120 కార్లు వాడారు, స్పెషల్లీ సినిమాకే హైలెట్ అయిన దుబాయ్ యాక్షన్ చేజింగ్ సీన్స్ ని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు. సాహో ఫస్ట్ నుంచి యాక్షన్ సీన్స్ మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చెయ్యడంతో బాలీవుడ్, హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లతో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ చేయించారు. ఈ రేంజ్ యాక్షన్ మూవీ దాదాపు 500 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా ప్రూవ్ చేసింది.

Prabhas : రాజమౌళికి నాకంటే చరణ్, తారక్‌లే ఎక్కువ

ఈ రేంజ్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ రెమ్యూరేషన్ ముందు ఖాన్లు, కపూర్లు, స్టార్లు.. వీళ్లందరూ ఇప్పుడు చాలా చిన్నవాళ్లు. పాన్ ఇండియా స్టార్ డమ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్న ప్రభాస్.. 150 కోట్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రభాస్ అంటే.. తెలుగు సినిమాకి బ్రాండ్. ప్రభాస్ అంటే గ్రాండియర్ కి ఐడెంటిటీ. ఇంత క్రేజ్ ఉన్న ప్రభాస్.. పాన్ ఇండియా క్రేజ్ దాటకుని పాన్ వరల్డ్ రేంజ్ కి వెళుతున్నారు.

Prabhas : ఆ ఫైట్‌లో నిజంగానే వీపు మీద కర్రతో కొట్టారు

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఎంగేజ్ అయిన ప్రభాస్.. సందీప్ రెడ్డితో చెయ్యబోయే స్పిరిట్ సినిమాని మాత్రం అంతకుమించి ప్లాన్ చేశారు. పాన్ ఇండియాతో పాటు జపనీస్, చైనీస్ లాంటి ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు. ఇలా ప్రభాస్ నెవర్ బిఫోర్ క్రేజ్, ఇమేజ్ తో హిట్, ఫట్ తో సంబంధం లేకుండా కెరీర్ గ్రాఫ్ తో పాటు.. ఇమేజ్ ని కూడా అదే రేంజ్ లో సంపాదించుకంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు.